తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Nep: నేపాల్‍పై టీమిండియా గ్రాండ్ విక్టరీ.. హ్యాట్రిక్ గెలుపుతో సెమీస్‍లో అడుగు

IND vs NEP: నేపాల్‍పై టీమిండియా గ్రాండ్ విక్టరీ.. హ్యాట్రిక్ గెలుపుతో సెమీస్‍లో అడుగు

23 July 2024, 22:58 IST

INDW vs NEPW Asia Cup 2024: ఆసియాకప్ 2024 టోర్నీలో భారత మహిళల జట్టు హ్యాట్రిక్ గెలుపు సాధించింది. నేడు (జూలై 23) నేపాల్‍తో జరిగిన మ్యాచ్‍లో టీమిండియా గెలిచింది. సెమీస్‍లో గెలుపు జోష్‍లో అడుగుపెడుతోంది.

  • INDW vs NEPW Asia Cup 2024: ఆసియాకప్ 2024 టోర్నీలో భారత మహిళల జట్టు హ్యాట్రిక్ గెలుపు సాధించింది. నేడు (జూలై 23) నేపాల్‍తో జరిగిన మ్యాచ్‍లో టీమిండియా గెలిచింది. సెమీస్‍లో గెలుపు జోష్‍లో అడుగుపెడుతోంది.
ఆసియాకప్ 2024 టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగించింది. దంబుల్లా వేదికగా నేడు జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‍లో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో నేపాల్‍పై విజయం సాధించింది. ఇప్పటికే పాకిస్థాన్, యూఏఈని ఓడించిన భారత్.. తుది గ్రూప్ మ్యాచ్‍లో నేపాల్‍ను మట్టికరిపించింది. 
(1 / 5)
ఆసియాకప్ 2024 టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగించింది. దంబుల్లా వేదికగా నేడు జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‍లో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో నేపాల్‍పై విజయం సాధించింది. ఇప్పటికే పాకిస్థాన్, యూఏఈని ఓడించిన భారత్.. తుది గ్రూప్ మ్యాచ్‍లో నేపాల్‍ను మట్టికరిపించింది. (Nepal Cricket- X)
గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో భారత్ దుమ్మురేపింది. గ్రూప్-ఏలో మూడింట మూడు గెలిచి సెమీస్‍లో జోష్‍తో అడుగుపెట్టింది. 
(2 / 5)
గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో భారత్ దుమ్మురేపింది. గ్రూప్-ఏలో మూడింట మూడు గెలిచి సెమీస్‍లో జోష్‍తో అడుగుపెట్టింది. (BCCI- X)
నేపాల్‍తో నేటి మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్  20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (48 బంతుల్లో 81 పరుగులు;12 ఫోర్లు, ఓ సిక్స్) ధనాధన్ బ్యాటింగ్‍తో అదరగొట్టారు. అర్ధ శకతం చేశారు.  దయాలన్ హేమలత (42 బంతుల్లో 47 పరుగులు) రాణించారు. ఈ మ్యాచ్‍కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‍ప్రీత్ కౌర్ విశ్రాంతి తీసుకోవటంతో స్మృతి మంధాన సారథ్యం వహించారు. 
(3 / 5)
నేపాల్‍తో నేటి మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్  20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (48 బంతుల్లో 81 పరుగులు;12 ఫోర్లు, ఓ సిక్స్) ధనాధన్ బ్యాటింగ్‍తో అదరగొట్టారు. అర్ధ శకతం చేశారు.  దయాలన్ హేమలత (42 బంతుల్లో 47 పరుగులు) రాణించారు. ఈ మ్యాచ్‍కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‍ప్రీత్ కౌర్ విశ్రాంతి తీసుకోవటంతో స్మృతి మంధాన సారథ్యం వహించారు. (BCCIWomen - X)
టీమిండియా బౌలర్లు విజృంభించటంతో లక్ష్యఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 96 పరుగులే చేసింది. నేపాల్ బ్యాటర్లలో ఒక్కరు కూడా 20 పరుగుల మార్క్ చేరలేదు. ఏడుగురు సింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యారు. సితా రాణా మగర్ (18) ఆ జట్టులో టాప్‍ స్కోరర్. భారత బౌలర్ దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. రాధాయాదవ్, అరుంధతీ యాదవ్ తలా రెండు, రేణుక సింగ్ ఓ వికెట్ తీసుకున్నారు.
(4 / 5)
టీమిండియా బౌలర్లు విజృంభించటంతో లక్ష్యఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 96 పరుగులే చేసింది. నేపాల్ బ్యాటర్లలో ఒక్కరు కూడా 20 పరుగుల మార్క్ చేరలేదు. ఏడుగురు సింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యారు. సితా రాణా మగర్ (18) ఆ జట్టులో టాప్‍ స్కోరర్. భారత బౌలర్ దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. రాధాయాదవ్, అరుంధతీ యాదవ్ తలా రెండు, రేణుక సింగ్ ఓ వికెట్ తీసుకున్నారు.(BCCI- X)
ఆసియాకప్ 2024లో సెమీఫైనల్స్ జూలై 26, జూలై 28న జరగనున్నాయి. రేపు (జూలై 24) జరిగే గ్రూప్ మ్యాచ్‍ల తర్వాత సెమీస్‍లో భారత ప్రత్యర్థి ఖరారవుతుంది. 
(5 / 5)
ఆసియాకప్ 2024లో సెమీఫైనల్స్ జూలై 26, జూలై 28న జరగనున్నాయి. రేపు (జూలై 24) జరిగే గ్రూప్ మ్యాచ్‍ల తర్వాత సెమీస్‍లో భారత ప్రత్యర్థి ఖరారవుతుంది. (BCCI- X)

    ఆర్టికల్ షేర్ చేయండి