తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Eng Highlights: భార‌త స్పిన్న‌ర్ల దెబ్బ‌కు ఇంగ్లండ్ చిత్తు - టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో రోహిత్ సేన‌

IND vs ENG Highlights: భార‌త స్పిన్న‌ర్ల దెబ్బ‌కు ఇంగ్లండ్ చిత్తు - టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో రోహిత్ సేన‌

28 June 2024, 10:19 IST

IND vs ENG Highlights: టీ20 వ‌ర‌ల్డ్ ఫైన‌ల్‌లో టీమిండియా అడుగుపెట్టింది. ఒక్క ఓట‌మి లేకుండా వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో 68 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

IND vs ENG Highlights: టీ20 వ‌ర‌ల్డ్ ఫైన‌ల్‌లో టీమిండియా అడుగుపెట్టింది. ఒక్క ఓట‌మి లేకుండా వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో 68 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 171 ప‌రుగులు  చేసింది. భార‌త స్పిన్న‌ర్లు కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్ ధాటికి ఇంగ్లండ్ 103 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. 
(1 / 8)
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 171 ప‌రుగులు  చేసింది. భార‌త స్పిన్న‌ర్లు కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్ ధాటికి ఇంగ్లండ్ 103 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. (AP)
ఈ రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బ‌ట్ల‌ర్… ఇండియాకు బ్యాటింగ్ అప్ప‌గించాడు. వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు ప‌లుమార్లు అంత‌రాయం ఏర్ప‌డింది.   గంట‌న్న‌ర ఆల‌స్యంగా మ్యాచ్ ప్రారంభ‌మైంది. 
(2 / 8)
ఈ రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బ‌ట్ల‌ర్… ఇండియాకు బ్యాటింగ్ అప్ప‌గించాడు. వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు ప‌లుమార్లు అంత‌రాయం ఏర్ప‌డింది.   గంట‌న్న‌ర ఆల‌స్యంగా మ్యాచ్ ప్రారంభ‌మైంది. (PTI)
ఆస్ట్రేలియాపై ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో అద‌ర‌గొట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెమీ ఫైన‌ల్‌లో బ్యాట్ ఝులిపించాడు. హాఫ్ సెంచ‌రీతో ఇండియాను ఆదుకున్నాడు. 39 బాల్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 57 ర‌న్స్ చేశాడు రోహిత్‌. 
(3 / 8)
ఆస్ట్రేలియాపై ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో అద‌ర‌గొట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెమీ ఫైన‌ల్‌లో బ్యాట్ ఝులిపించాడు. హాఫ్ సెంచ‌రీతో ఇండియాను ఆదుకున్నాడు. 39 బాల్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 57 ర‌న్స్ చేశాడు రోహిత్‌. (ANI)
రోహిత్ శ‌ర్మ త‌ర్వాత సూర్య కుమార్ యాద‌వ్ 36 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 47 ర‌న్స్ తో సెకండ్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. రోహిత్‌, సూర్య‌కుమార్ క‌లిసి మూడో వికెట్‌కు 73 ప‌రుగుల భాగ‌స్వామ్యం జోడించారు. 
(4 / 8)
రోహిత్ శ‌ర్మ త‌ర్వాత సూర్య కుమార్ యాద‌వ్ 36 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 47 ర‌న్స్ తో సెకండ్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. రోహిత్‌, సూర్య‌కుమార్ క‌లిసి మూడో వికెట్‌కు 73 ప‌రుగుల భాగ‌స్వామ్యం జోడించారు. (AP)
చివ‌ర‌లో హార్దిక్ పాండ్య 23 ర‌న్స్‌, జ‌డేజా 17 ప‌రుగుల‌తో పాటు అక్ష‌ర్ ప‌టేల్ కూడా  బ్యాటింగ్ మెరుపుల‌తో ఆక‌ట్టుకోవ‌డంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.
(5 / 8)
చివ‌ర‌లో హార్దిక్ పాండ్య 23 ర‌న్స్‌, జ‌డేజా 17 ప‌రుగుల‌తో పాటు అక్ష‌ర్ ప‌టేల్ కూడా  బ్యాటింగ్ మెరుపుల‌తో ఆక‌ట్టుకోవ‌డంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.(PTI)
అక్ష‌ర్ ప‌టేల్ స్పిన్ దెబ్బ‌కు ఇంగ్లండ్ టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. ఇంగ్లండ్ కెప్టెన్ బ‌ట్ట‌ర్‌తో పాటు జానీ బెయిర్‌స్టో, మెయిన్ అలీల‌ను అక్ష‌ర్ ప‌టేల్ పెవిలియిన్‌కు పంపించాడు. 
(6 / 8)
అక్ష‌ర్ ప‌టేల్ స్పిన్ దెబ్బ‌కు ఇంగ్లండ్ టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. ఇంగ్లండ్ కెప్టెన్ బ‌ట్ట‌ర్‌తో పాటు జానీ బెయిర్‌స్టో, మెయిన్ అలీల‌ను అక్ష‌ర్ ప‌టేల్ పెవిలియిన్‌కు పంపించాడు. (PTI)
ఐదో ఓవ‌ర్‌లో ఫిలిప్ సాల్ట్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్ వికెట్ల ప‌త‌నాన్ని ప్రారంభించాడు టీమిండియా పేస‌ర్ బుమ్రా. సాల్ట్‌తో పాటు జోఫ్రా ఆర్చ‌ర్ వికెట్ల‌ను బుమ్రా ద‌క్కించుకున్నాడు. 
(7 / 8)
ఐదో ఓవ‌ర్‌లో ఫిలిప్ సాల్ట్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్ వికెట్ల ప‌త‌నాన్ని ప్రారంభించాడు టీమిండియా పేస‌ర్ బుమ్రా. సాల్ట్‌తో పాటు జోఫ్రా ఆర్చ‌ర్ వికెట్ల‌ను బుమ్రా ద‌క్కించుకున్నాడు. (AP)
అక్ష‌ర్ ప‌టేల్‌తో పాటు కుల్దీప్ యాద‌వ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవ‌డంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డి  103 ప‌రుగుల‌కే చేతులెత్తేశారు. కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్ త‌లో మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రాకు రెండు వికెట్లు ద‌క్కాయి. 
(8 / 8)
అక్ష‌ర్ ప‌టేల్‌తో పాటు కుల్దీప్ యాద‌వ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవ‌డంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డి  103 ప‌రుగుల‌కే చేతులెత్తేశారు. కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్ త‌లో మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రాకు రెండు వికెట్లు ద‌క్కాయి. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి