తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dacia Spring Ev: రెనాల్ట్ డస్టర్ డిజైన్ లో సరికొత్త డేసియా స్ప్రింగ్ ఈవీ; సింగిల్ చార్జ్ తో 220 కిమీల రేంజ్

Dacia Spring EV: రెనాల్ట్ డస్టర్ డిజైన్ లో సరికొత్త డేసియా స్ప్రింగ్ ఈవీ; సింగిల్ చార్జ్ తో 220 కిమీల రేంజ్

22 February 2024, 12:27 IST

Dacia Spring EV: న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ డిజైన్ స్ఫూర్తిగా ఈ డేసియా స్ప్రింగ్ ఎలక్ట్రిక్ కార్ ను రూపొందించారు. ఇది త్వరలో మార్కెట్లోకి రానున్న రెనాల్ట్ క్విడ్ EV తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ డేసియా స్ప్రింగ్ ఈవీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

Dacia ఇటీవల ఫేస్‌లిఫ్ట్ చేసిన స్ప్రింగ్ EV మోడల్ ని ఆవిష్కరించింది, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మునుపటి మోడల్‌తో పోల్చితే గణనీయంగా అప్‌డేట్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారును  త్వరలో మార్కెట్లోకి రానున్న  రెనాల్ట్ క్విడ్-తరహాలో రూపొందించారు.
(1 / 6)

డేసియా స్ప్రింగ్ EV ఎక్స్ టీరియర్ ను మరింత ట్రెండీగా తీర్చి దిద్దారు. ఇది కొత్త తరం రెనాల్ట్ డస్టర్ నుండి ఎక్కువగా ప్రేరణ పొందినట్లుగా కనిపించే ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. ఫ్రంట్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు, కనెక్టెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, బంపర్ ల డిజైన్ లో ఆకర్షణీయమైన మార్పులు చేశారు. అందువల్ల ఈ చిన్న సిటీ హ్యాచ్‌బ్యాక్.. లుక్స్ లో బోల్డ్ క్రాస్ఓవర్ తరహా ఫీల్ ను ఇస్తుంది.
(2 / 6)

సీ పిల్లర్‌పై కొద్దిగా ట్వీక్ చేసిన ఫెండర్‌, రిబ్బన్ మినహా కారు సైడ్ ప్రొఫైల్ లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కారు రియర్ సైడ్ లో మాత్రం పలు అప్‌డేట్ లను చేశారు. ముఖ్యంగా చంకీ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌తో కనెక్ట్ చేసిన LED టెయిల్‌ లైట్‌లను అమర్చారు. ఇది  క్రాస్‌ఓవర్ వైబ్‌ని ఇస్తుంది. వెనుక బంపర్ ను కూడా అప్ గ్రేడ్ చేశారు.ఈ కారుకు 16-అంగుళాల కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌ ను అమర్చారు.
(3 / 6)

కొత్త డాసియా స్ప్రింగ్  క్యాబిన్ ఇంటీరియర్ లో గణనీయమైన మార్పులు చేశారు. స్టీరింగ్ వీల్ డిజైన్ ను మార్చారు. లేయర్డ్-లుకింగ్ డాష్‌బోర్డ్ ఇప్పుడు ఏడు-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సెంటర్ కన్సోల్ ను కూడా అప్‌డేట్ చేశారు, గేర్ షిఫ్టర్ ను కూడా ఆకర్షణీయంగా రూపొందించారు.
(4 / 6)

కొత్త డేసియా స్ప్రింగ్ ఈవీ విస్తృతమైన ప్రాక్టికాలిటీ ఫోకస్డ్ అప్‌డేట్‌లతో వస్తుంది. వాటిలో హుడ్ కింద ఏర్పాటు చేసిన 35-లీటర్ ఫ్రంక్ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 308-లీటర్ల బూట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది,
(5 / 6)

కొత్త డేసియా స్ప్రింగ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పవర్‌ట్రెయిన్ లో మార్పులు చేయలేదు. ఇందులో 26.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనితో సింగిల్ ఛార్జ్‌పై 220 కిమీ దూరం ప్రయాణించవచ్చు. ఈ ఫేస్ లిఫ్ట్ డేసియా స్ప్రింగ్ ఈవీలో ఇప్పుడు బై - డైరెక్షనల్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. అంటే ఈ EVలోని బ్యాటరీ వివిధ ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను  కూడా ఛార్జ్ చేయగలదు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి