తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chandrayaan-3: చందమామ వైపు శరవేగంగా దూసుకుపోతున్న చంద్రయాన్ 3; ఆగస్ట్ 23న ల్యాండింగ్!

Chandrayaan-3: చందమామ వైపు శరవేగంగా దూసుకుపోతున్న చంద్రయాన్ 3; ఆగస్ట్ 23న ల్యాండింగ్!

02 August 2023, 12:18 IST

బారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. ఇటీవలే చంద్రయాన్ 3 భూ కక్ష్యను దాటి చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది. 

బారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. ఇటీవలే చంద్రయాన్ 3 భూ కక్ష్యను దాటి చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది. 
భూ కక్ష్యలో తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 ముగించిందని ఇస్రో ప్రకటించింది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో చేరడానికి ప్రయాణం ప్రారంభించిందని తెలిపింది. 
(1 / 5)
భూ కక్ష్యలో తన ప్రయాణాన్ని చంద్రయాన్ 3 ముగించిందని ఇస్రో ప్రకటించింది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో చేరడానికి ప్రయాణం ప్రారంభించిందని తెలిపింది. (ISRO/ X)
చంద్రయాన్ తదుపరి మజిలీ చంద్రుడేనంటూ ఇస్రో ఒక ట్వీట్ చేసింది. ఆగస్ట్ 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 వెళ్తుందని వెల్లడించింది.
(2 / 5)
చంద్రయాన్ తదుపరి మజిలీ చంద్రుడేనంటూ ఇస్రో ఒక ట్వీట్ చేసింది. ఆగస్ట్ 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 వెళ్తుందని వెల్లడించింది.(ISRO/ X)
ట్రాన్స్ ల్యూనార్ ఆర్బిట్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లడం చంద్రయాన్ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి.
(3 / 5)
ట్రాన్స్ ల్యూనార్ ఆర్బిట్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లడం చంద్రయాన్ ప్రయోగంలో మరో కీలక మైలు రాయి.(AP)
చంద్రుడి కక్ష్యలోకి చేరిన తరువాత క్రమంగా ప్రొపల్షన్ మొడ్యూల్ నుంచి ల్యాండర్ వేరు అవుతుంది. ఆ తరువాత క్రమంగా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతుంది. అనంతరం, ల్యాండర్ నుంచి ర్యాంప్ మీదుగా ఆరు చక్రాల రోవర చంద్రుడి ఉపరితలంపైకి వెళ్తుంది. అక్కడ 14 రోజుల పాటు (ఒక ల్యూనార్ డే) కలియతిరుగుతూ భూమి పైకి హై రెసొల్యూషన్ ఫొటోలను పంపుతుంది.
(4 / 5)
చంద్రుడి కక్ష్యలోకి చేరిన తరువాత క్రమంగా ప్రొపల్షన్ మొడ్యూల్ నుంచి ల్యాండర్ వేరు అవుతుంది. ఆ తరువాత క్రమంగా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతుంది. అనంతరం, ల్యాండర్ నుంచి ర్యాంప్ మీదుగా ఆరు చక్రాల రోవర చంద్రుడి ఉపరితలంపైకి వెళ్తుంది. అక్కడ 14 రోజుల పాటు (ఒక ల్యూనార్ డే) కలియతిరుగుతూ భూమి పైకి హై రెసొల్యూషన్ ఫొటోలను పంపుతుంది.(AP)
చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడిపై ఆగస్ట్ 23న దిగుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, చంద్రుడిపై అడుగిడి చంద్రయాన్ చరిత్ర సృష్టిస్తుంది.
(5 / 5)
చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడిపై ఆగస్ట్ 23న దిగుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, చంద్రుడిపై అడుగిడి చంద్రయాన్ చరిత్ర సృష్టిస్తుంది.(NASA Website)

    ఆర్టికల్ షేర్ చేయండి