తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Brahomostavalu : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేష వాహ‌నసేవలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

Tirumala Brahomostavalu : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేష వాహ‌నసేవలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

05 October 2024, 9:50 IST

Tirumala Brahomostavalu : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అటు పెద్ద శేష వాహ‌నసేవలో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

  • Tirumala Brahomostavalu : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అటు పెద్ద శేష వాహ‌నసేవలో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో మొద‌టి రోజు శుక్రవారం రాత్రి.. పెద్ద శేష‌ వాహ‌న సేవ‌ జరిగింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
(1 / 7)

వివిధ ప్రాంతాలకు చెందిన 14 క‌ళాబృందాలలో 410 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు. వారి ప్రదర్శనల పట్ల భక్తులు ఆధ్యాత్మికానందం పొందారు.
(2 / 7)

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ నృత్యం, తమిళనాడుకు చెందిన లతారవి ఆధ్వర్యంలో మయూర నృత్యం, కేరళ రాష్ట్రానికి చెందిన వీణ బృందం యక్షగానం, కర్నాటక కళా రూపమైన వీరగాశను చేతన్ బృందం అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. 
(3 / 7)

శ్రీకాకుళం నుండి దుర్గా భవానీ, తిరుమల నుండి శ్రీనివాసులు, రాజమండ్రి నుండి ‌సురేష్ బాబు, తిరుపతి బాలమందిర్ విద్యార్థులు తమ కోలాటాలతో.. మంత్ర ముగ్ధుల‌ను చేశారు.
(4 / 7)

హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీదేవి బృందం ఒగ్గు డోలుతో, తిరుపతికి చెందిన డాక్టర్ మురళీకృష్ణ బృందం మోహినీయట్టంతో ప్రదర్శనలు ఇచ్చారు.
(5 / 7)

కర్నాటకకు చెందిన వనీష బృందం పటకునిత కళా విన్యాసం, రవికుమార్ చిలిపిలి గొంబె నృత్యం, నాగేంద్ర బృందం కంసాలి రూపకంతో తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులకు నయనానందాన్ని కలిగించారు.
(6 / 7)

శనివారం చిన్నశేష వాహన సేవ ఉంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి