తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Rains : హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం, ట్రాఫిక్ కష్టాలు షురూ!

Hyderabad Rains : హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం, ట్రాఫిక్ కష్టాలు షురూ!

17 June 2024, 17:07 IST

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

  • Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ లో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. 
(1 / 6)

ఈదురుగాలుల ధాటికి హైదరాబాద్ లో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌, షేక్‌పేట, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అమీర్‌పేట, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పురా, ఎస్ఆర్ నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్‌, గండిపేట్‌, శివరాంపల్లి, ఎల్బీనగర్, నాగోల్ , మన్సూరాబాద్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్‌ లో భారీగా వర్షం కురిసింది. 
(2 / 6)

భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. 
(3 / 6)

హైదరాబాద్ నగరంలోని పశ్చిమ ప్రాంతాల్లో భారీ ఉరుములతో వడగళ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్ తో పాటు దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలైన ఎల్‌బి నగర్, సరూర్ నగర్‌లో మరో 1 గంటపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 
(4 / 6)

రాష్ట్రంలో మరో అయిదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.  
(5 / 6)

 భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షానికి వరదనీరు రోడ్లపైకి చేరి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి