తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mosquito Bite:దోమ కాటు వల్ల చర్మంపై దద్దుర్లను ఇలా ఈజీగా తొలగించుకోండి!

Mosquito Bite:దోమ కాటు వల్ల చర్మంపై దద్దుర్లను ఇలా ఈజీగా తొలగించుకోండి!

20 August 2022, 17:06 IST

Tips To Get Rid Of Mosquito: దోమ కాటు వల్ల చాలా మందికి చర్మ సమస్యలు ఉంటాయి. ఈ విషయంలో కింది చిట్కాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

  • Tips To Get Rid Of Mosquito: దోమ కాటు వల్ల చాలా మందికి చర్మ సమస్యలు ఉంటాయి. ఈ విషయంలో కింది చిట్కాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
వర్షాకాలంలో సాధారణంగా దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచినా వాటిని ఆపలేరు. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ మలేరియా, దురద, దద్దుర్లు, వాపు, ఎరుపు వంటి అనేక వ్యాధులు కూడా వస్తాయి. అయితే దోమ కాటు వల్ల చర్మ సమస్యలు వస్తే ఏం చేయాలో చూద్దాం.
(1 / 5)

దోమలు ఎక్కువగా పాజిటివ్ బ్లడ్ గ్రూపులు కుడుతాయని అనేక అధ్యాయాలలో తెలింది. వారి రక్తంలో దోమలను ఆకర్షించే ప్రత్యేక రసాయనం ఉంటుంది. చెమట, వేడి శరీరం కూడా దోమలను ఆకర్షిస్తుంది. గర్భధారణ సమయంలో దోమలు ఎక్కువగా కుడతాయి.
(2 / 5)

దోమలు కుడితే ఏం చేయాలి? మొదట, దురదను తగ్గించుకోండి. లేకపోతే చర్మంపై చికాకు మరింత పెరుగుతుంది. దోమ కాటుపై ఐస్ ప్యాక్ ఉంచండి. ఇది వాపు తగ్గించడానికి సహాయం చేస్తుంది. విపరీతమైన దురద ఉంటే మీరు కాలమైన్ లోషన్‌ను కూడా ఉపయోగించవచ్చు. అలెర్జీ ఉంటే, మీరు యాంటీ-అలెర్జీ ఔషధాలను తీసుకోవచ్చు. మీరు దోమ కాటు ప్రాంతాన్ని సబ్బు, నీటితో శుభ్రం చేస్తే, చికాకు లేదా దద్దుర్లు చాలా తక్కువగా ఉంటాయి.
(3 / 5)

మధ్యాహ్నం లేదా సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు దోమల నివారణకు సంబందించిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా పిల్లలు ముదురు, నలుపు రంగుల వాటిని ధరించకుండా చూడండి. ఇంటి కిటికీలకు దోమతెరలు అమర్చండి. మధ్యాహ్నం అయితే కిటికీ తెరిచినా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంటి దగ్గర నీరు పేరుకుపోకుండా చూసుకుంటే దోమల వృద్ధి తగ్గుతుంది.
(4 / 5)

అంతేకాకుండా, ఇంట్లో దోమలను నివారించడానికి కోన్ని హోం రెమెడీ సహాయం కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి, లోపల లవంగాలతో నింపండి. మొత్తం లవంగాన్ని నిమ్మకాయలో చొప్పించండి. తర్వాత గది మూలలో ఒక ప్లేట్‌లో నిమ్మకాయ ముక్కలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఇంట్లోకి రావు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి