Emmy Awards 2022 winners Full List: ఎమ్మీ అవార్డుల్లో స్క్విడ్ గేమ్ రికార్డు.. విజేతల పూర్తి వివరాలివిగో
13 September 2022, 12:51 IST
Emmy Awards 2022: సినిమాలకు అత్యున్నత పురస్కారం ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డులనే చెప్పవచ్చు. అలాగే బుల్లితెరకు ఎమ్మీ అవార్డులు ఆస్కార్లకు ఏ మాత్రం తక్కువ కాదు. ప్రతి ఏటాలానే ఈ సంవత్సరం కూడా ఎమ్మి అవార్డ్స్ 2022 ప్రదానం జరిగింది. ఈ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న విదేశీ సిరీస్‌గా స్క్విడ్ గేమ్ రికార్డు సృష్టించింది. మొత్తం 14 విభాగాల్లో నామినేషన్లు అందుకుంది. డ్రామా సిరీస్ విభాగంలో ఈ సిరీస్ ను తెరకెక్కించిన హ్యాంగ్ డాంగ్ హ్యాక్ ఉత్తమ దర్శకుడిగా(Outstanding Director) పురస్కారం సాధించగా.. ప్రధాన పాత్ర పోషించిన లీ జాంగ్ జే ఉత్తమ నటుడి(Outstanding Lead Actor) విభాగంలో అవార్డు దక్కించుకున్నాడు. ఎమ్మీ దక్కించుకున్న చివరి ఆంగ్లేతర సిరీస్ స్క్విడ్ గేమ్ కాకూడని తాను ఆశిస్తున్నట్లు ఈ సిరీస్ దర్శకుడు హ్వాంగ్ చెపపాడు.
- Emmy Awards 2022: సినిమాలకు అత్యున్నత పురస్కారం ఏదైనా ఉందంటే అది ఆస్కార్ అవార్డులనే చెప్పవచ్చు. అలాగే బుల్లితెరకు ఎమ్మీ అవార్డులు ఆస్కార్లకు ఏ మాత్రం తక్కువ కాదు. ప్రతి ఏటాలానే ఈ సంవత్సరం కూడా ఎమ్మి అవార్డ్స్ 2022 ప్రదానం జరిగింది. ఈ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న విదేశీ సిరీస్‌గా స్క్విడ్ గేమ్ రికార్డు సృష్టించింది. మొత్తం 14 విభాగాల్లో నామినేషన్లు అందుకుంది. డ్రామా సిరీస్ విభాగంలో ఈ సిరీస్ ను తెరకెక్కించిన హ్యాంగ్ డాంగ్ హ్యాక్ ఉత్తమ దర్శకుడిగా(Outstanding Director) పురస్కారం సాధించగా.. ప్రధాన పాత్ర పోషించిన లీ జాంగ్ జే ఉత్తమ నటుడి(Outstanding Lead Actor) విభాగంలో అవార్డు దక్కించుకున్నాడు. ఎమ్మీ దక్కించుకున్న చివరి ఆంగ్లేతర సిరీస్ స్క్విడ్ గేమ్ కాకూడని తాను ఆశిస్తున్నట్లు ఈ సిరీస్ దర్శకుడు హ్వాంగ్ చెపపాడు.