తెలుగు న్యూస్  /  ఫోటో  /  Longest Travelling Trains: మన దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే టాప్ 10 రైళ్లు ఇవే.. ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు..

Longest travelling trains: మన దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే టాప్ 10 రైళ్లు ఇవే.. ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు..

27 November 2024, 21:16 IST

Longest travelling trains: రైలు ప్రయాణం సాధారణంగా ఒక జర్నీలా కాకుండా, ఒక మెమొరీలా ఉంటుంది. ట్రైన్ జర్నీని ఆస్వాదించని వారు చాలా అరుదు. అదే రోజుల తరబడి చేసే రైలు ప్రయాణంలో కనిపించే దృశ్యాలు మైమరింపచేస్తాయి. భారత్ లో అత్యంత దూరం ప్రయాణించే 10 రైళ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

వివేక్ ఎక్స్ ప్రెస్భారత్ లో అత్యంత దూరం ప్రయాణించే రైలుగా వివేక్ ఎక్స్ ప్రెస్ నిలుస్తుంది. ఇది 4,154 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలుకు తమిళనాడులోని కన్యాకుమారి నుండి అస్సాంలోని దిబ్రూగఢ్ కు ప్రయాణించడానికి 75 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఈ రైలు ప్రతి శనివారం దిబ్రూగఢ్ నుండి బయలుదేరుతుంది, మళ్లీ మూడు రోజుల తరువాత కన్యాకుమారి నుండి బయలుదేరుతుంది.
(1 / 10)

అరోనై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్భారతదేశంలో రెండవ అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు అరోనై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు మార్గం చాలా అందమైనది. విభిన్నమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ నుండి అస్సాంలోని సిల్చార్ వరకు నడుస్తుంది. ఈ రైలు 3,932 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు ప్రయాణ సమయం 74 గంటలు. ఇది కేరళ. అస్సాం లతో పాటు, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో ఈ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది. వారానికి ఒకసారి ఇది రాకపోకలు సాగిస్తుంటాయి. 
(2 / 10)

హిమ సాగర్ ఎక్స్ ప్రెస్భారతదేశంలోని అత్యంత దూరం ప్రయాణించే మూడో రైలు హిమ సాగర్ ఎక్స్ ప్రెస్. ఈ రైలు భారతదేశపు దక్షిణ, ఉత్తర మార్గంలో వివిధ భూభాగాల గుండా వెళుతుంది. ఈ రైలు తమిళనాడులోని కన్యాకుమారి నుండి బయలుదేరి జమ్మూ కాశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా వరకు నడుస్తుంది. ఇది 3,787 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. మొత్తం ప్రయాణానికి 68 గంటల 20 నిమిషాలు పడుతుంది.
(3 / 10)

తమిళనాడు టెన్ జమ్మూ ఎక్స్ ప్రెస్ఈ రైలు కూడా తమిళనాడు నుంచి జమ్మూకశ్మీర్ కు ప్రయాణిస్తుంది.  ఇది భారతదేశంలో పొడవైన రైల్వే లైన్ల జాబితాలో నాల్గవది. ఈ రైలు తమిళనాడులోని తిరునల్వేలి జంక్షన్ నుండి  జమ్మూ కాశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వరకు నడుస్తుంది. ప్రయాణ సమయం 71 గంటల 20 నిమిషాలు. ఇది 3,642 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.
(4 / 10)

న్యూ తిన్సుకియా - బెంగళూరు వీక్లీ ఎక్స్ ప్రెస్ఇది అత్యంత దూరం ప్రయాణించే రైళ్లలో ఐదవది. ఇది న్యూ తిన్సుకియా బెంగుళూరు వీక్లీ ఎక్స్ ప్రెస్. ఇది అస్సాంలోని న్యూ తిన్సుకియా నుండి కర్ణాటకలోని బెంగళూరు వరకు నడుస్తుంది.. ఈ రైలు 3,642 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్రయాణం పూర్తి కావడానికి 65 గంటల సమయం పడుతుంది. ఈ ఎక్స్ ప్రెస్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మరెన్నో రాష్ట్రాలను కవర్ చేస్తుంది. ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది.
(5 / 10)

హమ్ సఫర్  ఎక్స్ ప్రెస్ హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ భారతదేశంలోని ఆరవ పొడవైన రైల్వే లైన్. త్రిపురలోని అగర్తలా నుండి కర్ణాటకలోని బెంగళూరు కంటోన్మెంట్ వరకు ఈ రైలు నడుస్తుంది. ప్రకృతి అందాల మార్గాలలో ప్రయాణాన్ని ఇష్టపడేవారికి ఎక్స్ ప్రెస్ ఒక గొప్ప ఎంపిక. రైలు 3,599 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దాని నిర్దేశిత ప్రదేశాలను చేరుకోవడానికి 65 గంటలు పడుతుంది. ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది.
(6 / 10)

ఎస్ ఎఫ్ ఎక్స్ ప్రెస్భారతదేశంలోని పొడవైన రైల్వే మార్గాల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఇది  అస్సాంలోని సిల్చార్ నుండి తమిళనాడులోని కోయంబత్తూరు వరకు నడుస్తుంది. ఈ రైలు 64 గంటల 15 నిమిషాలు నడుస్తుంది, 3,544 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు అనేక రాష్ట్రాలతో అనుసంధానించబడి ఉంది. ఈ మార్గంలో ప్రకృతి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
(7 / 10)

అవధ్ అస్సాం ఎక్స్ ప్రెస్దేశంలో పొడవైన రైల్వే లైన్ల జాబితాలో అవధ్ అస్సాం ఎక్స్ ప్రెస్ ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇది 3,118 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు తన గమ్యాన్ని చేరుకోవడానికి 66 గంటల 25 నిమిషాలు పడుతుంది, ఇది అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.
(8 / 10)

కొచువేలి ఎక్స్ ప్రెస్:తొమ్మిదవ స్థానంలో కొచువేలి ఎక్స్ ప్రెస్ ఉంది. ఇది భారతదేశంలోని పొడవైన రైల్వే లైన్లలో ఒకటి. ఈ రైలు కేరళలోని కొచువేలి నుండి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ వరకు ప్రయాణిస్తుంది. దీని ప్రయాణ సమయం 52 గంటల 30 నిమిషాలు. ఇది 3,110 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.
(9 / 10)

యశ్వంత్ పూర్ కామాఖ్య ఎక్స్ ప్రెస్ఈ జాబితాలో అట్టడుగున, అంటే 10వ స్థానంలో ఉన్నది యశ్వంత్ పూర్ కామాఖ్య ఎక్స్ ప్రెస్. ఇది భారతదేశంలోని పదవ పొడవైన రైల్వే మార్గాన్ని కలిగి ఉంది. ఇది కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుండి అస్సాంలోని కామాఖ్య వరకు నడుస్తుంది. ఇది 3,025 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దీని ప్రయాణానికి 52 గంటల 30 నిమిషాలు పడుతుంది..
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి