తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weather Alert : బంగాళాఖాతంలో తుపాన్ - దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

Weather ALERT : బంగాళాఖాతంలో తుపాన్ - దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

30 November 2024, 6:17 IST

Cyclone Fengal Updates :నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ ఇవాళ్టి నుంచి వానలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

  • Cyclone Fengal Updates :నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ ఇవాళ్టి నుంచి వానలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు 'ఫెంగల్ 'గా నామకరణం చేశారు. ఉత్తర-వాయువ్య దిశగా 'ఫెంగల్ ' తుపాన్ పయనించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
(1 / 8)

తుపాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో ఇవాళ,రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  కొన్నిచోట్ల అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(2 / 8)

 ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి,నెల్లూరు,ప్రకాశం తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
(3 / 8)

దక్షిణకోస్తాలో ఇవాళ,రేపు అక్కడక్కడ భారీ -అతిభారీ వర్షాలు, రేపు కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ పేర్కొంది. రాయలసీమలో ఇవాళ,రేపు అక్కడక్కడ భారీ - అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల ఆదివారం వరకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
(4 / 8)

ఇక తెలంగాణలో ఇవాళ్టి నుంచి (నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(5 / 8)

డిసెంబర్ 1వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 8)

 డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.
(7 / 8)

డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి