తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : తెలంగాణకు రెయిన్ అలర్ట్... వచ్చే 3 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు Imd ఎల్లో హెచ్చరికలు

AP TG Weather Updates : తెలంగాణకు రెయిన్ అలర్ట్... వచ్చే 3 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు IMD ఎల్లో హెచ్చరికలు

19 September 2024, 14:47 IST

AP Telangana Weather Updates : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడనున్నాయి. 

  • AP Telangana Weather Updates : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడనున్నాయి. 
ఏపీ, తెలంగాణకు ఐఎండీ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. 
(1 / 6)

సెప్టెంబర్ 21వ తేదీన తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(2 / 6)

సెప్టెంబర్ 22వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(3 / 6)

సెప్టెంబర్ 23వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(4 / 6)

సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పింది. 
(5 / 6)

ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ(సెప్టెంబర్ 19) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి మరియు కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి