తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weather News : మరో అల్పపీడనం... కోస్తా, సీమ జిల్లాలకు వర్ష సూచన - ఈనెల 20 తర్వాత మరోసారి భారీ వర్షాలు!

Weather News : మరో అల్పపీడనం... కోస్తా, సీమ జిల్లాలకు వర్ష సూచన - ఈనెల 20 తర్వాత మరోసారి భారీ వర్షాలు!

14 September 2024, 8:59 IST

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడుతాయని పేర్కొంది. ఈనెల 20 తర్వాత కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడుతాయని పేర్కొంది. ఈనెల 20 తర్వాత కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఆదివారం నాటికి పశ్చిమబెంగాల్‌ తీరంలో వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తీరం దాటిన తర్వాత ఈ నెల 18 నాటికి ఏపీకి సమీపంగా వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
(1 / 6)

ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ  లెక్కలు వేస్తోంది. కోస్తాంధ్రతో పాటు సీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా,
(2 / 6)

ఈ అల్పపీడన ప్రభావం ఏపీ, ఒడిశా, ఛత్తీస్ ఘట్, బెంగల్ రాష్ట్రాలపై చూపనుంది. అయితే ఏపీలోని  శ్రీకాకుళం, మన్యం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  ఐఎండీ హెచ్చరించింది. ఒక్కసారిగా వాతావరణ మారిపోయి… భారీ స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. 
(3 / 6)

ఈ ప్రభావంతో ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో  వర్షాలు కురిసే ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. 
(4 / 6)

ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 
(5 / 6)

బంగాళాఖాతంలో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. 28 నాటికి అది కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం లేదా తుపానుగా బలపడుతుందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఈ నెల 20 తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి