తెలుగు న్యూస్  /  ఫోటో  /  Icc On Harmanpreet Kaur : హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ కఠిన చర్యలు.. ఆమెపై నిషేధం!

ICC On Harmanpreet Kaur : హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ కఠిన చర్యలు.. ఆమెపై నిషేధం!

25 July 2023, 11:41 IST

IND Vs BAN Harmanpreet Kaur : బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి మూడో వన్డేలో దారుణంగా ప్రవర్తించిన భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఐసీసీ నిషేధం ముప్పును ఎదుర్కొంటున్న కౌర్ 2023 ఆసియా క్రీడల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.

  • IND Vs BAN Harmanpreet Kaur : బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి మూడో వన్డేలో దారుణంగా ప్రవర్తించిన భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఐసీసీ నిషేధం ముప్పును ఎదుర్కొంటున్న కౌర్ 2023 ఆసియా క్రీడల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ బ్యాట్‌తో వికెట్లను కొట్టి అంపైర్‌పై విరుచుకుపడింది. ఆపై ఫోటో షూట్ సమయంలో బంగ్లాదేశ్ జట్టును వెక్కిరించింది. అంపైర్స్ ను పిలవండని వెటకారం చేసింది. దీంతో బంగ్లా ప్లేయర్స్ ఫొటో సెషన్ నుంచి వెళ్లిపోయారు.
(1 / 8)

టీమ్ ఇండియా కెప్టెన్ తీరుపై భారత సీనియర్ క్రికెటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తించిన తీరును ఖండించారు.
(2 / 8)

ప్రస్తుతం కౌర్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆమెపై కనీసం రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం పడే అవకాశం ఉంది.
(3 / 8)

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, హర్మన్‌ప్రీత్ ప్రవర్తన గరిష్టంగా నాలుగు డీమెరిట్ పాయింట్లకు దారితీయవచ్చు. ఇందులో మ్యాచ్ సామగ్రి (వికెట్) దెబ్బతీసినందుకు మూడు డీమెరిట్ పాయింట్లు, మ్యాచ్ అధికారిని బహిరంగంగా విమర్శించినందుకు ఒక పాయింట్ ఉన్నాయి.
(4 / 8)

ఐసీసీ నిబంధనల ప్రకారం, 24 నెలల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందిన ప్లేయర్.. ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నుండి సస్పెండ్ చేయబడతారు. అంటే ఆ జట్టు తర్వాత ఆడే మ్యాచ్ ఫార్మాట్‌పై ఆధారపడి ఉంటుంది.
(5 / 8)

భారత్ తదుపరి.. ఆసియా క్రీడల ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. 
(6 / 8)

ఒకవేళ హర్మన్‌ప్రీత్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తే, ఆమె గైర్హాజరిలో ఉన్నప్పుడు భారత జట్టు ఆసియా క్రీడలు ఆడాల్సి ఉంటుంది. క్వార్టర్స్‌, సెమీ ఫైనల్స్‌లో ఆడే అవకాశం లేదు. కాబట్టి ఫైనల్ మ్యాచ్‌లో మాత్రమే కనిపించవచ్చు. 
(7 / 8)

ఆంక్షలపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చ ఎక్కువగా నడుస్తోంది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి