తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Brahmotsavam : తిరుమల బ్రహ్మోత్సవాలు - హ‌నుమంత వాహ‌నంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Tirumala Brahmotsavam : తిరుమల బ్రహ్మోత్సవాలు - హ‌నుమంత వాహ‌నంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

23 September 2023, 11:36 IST

Hanumantha Vahana Seva at Tirumala 2023: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజు అయిన శనివారం ఉదయం స్వామివారు హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా కటాక్షించారు. 

  • Hanumantha Vahana Seva at Tirumala 2023: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజు అయిన శనివారం ఉదయం స్వామివారు హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా కటాక్షించారు. 
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ‌నివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
(1 / 6)
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ‌నివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.(TTD )
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
(2 / 6)
వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.(TTD )
హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు
(3 / 6)
హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు(TTD )
గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.
(4 / 6)
గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.(TTD )
శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భక్తులను కటాక్షిస్తారు.
(5 / 6)
శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భక్తులను కటాక్షిస్తారు.(TTD )
వాహనసేవల‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి. తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఢిల్లీ స్థానికి స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జేఈవో లు స‌దాభార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవిందనామాలతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి.
(6 / 6)
వాహనసేవల‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి. తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఢిల్లీ స్థానికి స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, జేఈవో లు స‌దాభార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవిందనామాలతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి.(TTD )

    ఆర్టికల్ షేర్ చేయండి