తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ginger Benefits: చిన్న అల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Ginger Benefits: చిన్న అల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

13 October 2023, 18:11 IST

Ginger Benefits: అల్లం మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల ఒకటి కాదు, వందల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న అల్లం ముక్కలో కూడా ఎన్నో లాభాలున్నాయి. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోండి.

  • Ginger Benefits: అల్లం మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల ఒకటి కాదు, వందల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న అల్లం ముక్కలో కూడా ఎన్నో లాభాలున్నాయి. అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
అల్లం అత్యంత ప్రసిద్ధ భారతీయ సుగంధ ద్రవ్యాలలో ఒకటి. అల్లం రెగ్యులర్ గా వంటలో ఉపయోగిస్తారు. అల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఆరోగ్యాన్ని మార్చే శక్తి ఒక చిన్న అల్లం ముక్కకు ఉంది.
(1 / 8)

అల్లం ముక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే అల్లం ను నేరుగా తినకుండా రసం రూపంలో తీసుకుంటే మంచిది. వేడి నీళ్లలో అల్లం ముక్క వేసి ఫిల్టర్ చేయాలి. కావాలనుకుంటే నిమ్మరసం మరియు తేనె జోడించండి. దీన్ని రెగ్యులర్ గా తాగడం చాలా మంచిది.
(2 / 8)

అల్లంలో యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సహజ నొప్పి నివారిణిగా,  జ్వరాన్ని తగ్గించేదిగా పనిచేస్తుంది.
(3 / 8)

గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు 2 కప్పుల నీటిలో ఒక అల్లం ముక్కను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి వేడి వేడిగా తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇది ఎసిడిటీ సమస్యను కూడా తగ్గిస్తుంది.
(4 / 8)

అల్లం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో అల్లం రసాన్ని రాయండి. అల్లం రసం తాగడం వల్ల కూడా అనేక శారీరక నొప్పులు తగ్గుతాయి.
(5 / 8)

అల్లంలో సహజసిద్ధమైన యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ అల్లం తింటే చిన్న చిన్న రోగాలు దూరమవుతాయి. అల్లం రోజూ తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది. అల్లం స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది.
(6 / 8)

ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత అలసటగా, బలహీనంగా అనిపిస్తే అల్లం ముక్కను మరిగించిన నీటిని తాగండి. ఇది శరీరానికి పుష్కలంగా తక్షణ శక్తిని ఇస్తుంది. అల్లం శరీరంలోని బలహీనతలను వెంటనే దూరం చేస్తుంది.
(7 / 8)

జీర్ణ సమస్యలు ఉన్నవారికి అల్లం చాలా మంచిది. రోజూ ఉదయం 1 కప్పు అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. గొంతు నొప్పికి కూడా అల్లం బాగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పడు అల్లం టీ తాగితే తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు, సమస్యను దూరం చేస్తుంది.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి