తెలుగు న్యూస్  /  ఫోటో  /  Early Morning Food : ఉదయాన్నే హెల్తీ అని తీసుకునే ఫుడ్స్ అంత మంచివి కావంట..

Early Morning Food : ఉదయాన్నే హెల్తీ అని తీసుకునే ఫుడ్స్ అంత మంచివి కావంట..

17 December 2022, 8:10 IST

Early Morning Food : ఉదయాన్నే మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంతా మనం ఎనర్జీటిక్గా ఉండేలా చేస్తుంది. అయితే ఉదయాన్నే హెల్తీ అనుకునే ఆహారాలు తీసుకోవడం వల్ల లాభాలు కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. వాటికి దూరంగా ఉంటేనే మంచిది అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Early Morning Food : ఉదయాన్నే మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంతా మనం ఎనర్జీటిక్గా ఉండేలా చేస్తుంది. అయితే ఉదయాన్నే హెల్తీ అనుకునే ఆహారాలు తీసుకోవడం వల్ల లాభాలు కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. వాటికి దూరంగా ఉంటేనే మంచిది అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్పాహారం చాలా ముఖ్యమైనది, ఇది రోజంతా మన శరీరానికి ఇంధనంగా సహాయపడుతుంది. అయితే చాలామందికి తెలియకుండానే లేదా పని చేసే హడావిడిలో మంచి ఫుడ్ అనుకుని.. ఎక్కువ హాని చేసే ఆహారాన్ని తింటారు. అయితే ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 6)

ఉదయం ఒక కప్పు టీ లేకపోతే.. తలనొప్పి అంటూ తలలు పట్టుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే మీకు కూడా ఇదే అలవాటు ఉంటే ఇక ఆపేయండి. దానికి బదులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా గోరువెచ్చని జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. అల్పాహారం తర్వాత కనీసం 20 నిమిషాల తర్వాత టీ తాగాలి.
(2 / 6)

కార్న్‌ఫ్లేక్స్, మ్యూస్లీ వంటి అల్పాహార తృణధాన్యాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని అనుకుంటారు. ఇవి కూడా ప్రాసెస్ చేసిన ఆహారాలే అని గుర్తుపెట్టుకోండి. దీనిలో కూడా పంచదార ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఊబకాయం, గుండె సమస్యలు తలెత్తుతాయి.
(3 / 6)

ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ తెస్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయమేమిటంటే.. మార్కెట్‌లో బ్రౌన్ బ్రెడ్‌లు కూడా వైట్ బ్రెడ్ పిండితోనే తయారు చేస్తారు. ఇందులో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు పదార్థాల జాబితాను తనిఖీ చేసుకోండి. మల్టీ గ్రైన్ రొట్టె కొనుగోలు చేయడం ఉత్తమం.
(4 / 6)

పండ్ల రసం తీసుకోవడం వల్ల శరీరానికి కచ్చితంగా మేలు జరుగుతుంది. కానీ దుకాణం నుంచి కొనుగోలు చేస్తే పండ్ల రసంలో అది ఉండదు. చాలా వాణిజ్య పండ్ల రసం ప్యాకెట్లలో ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. అలాగే ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. కృత్రిమ రంగులు, రుచులను ఉపయోగిస్తారు. కాబట్టి ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. లేదంటే మొత్తం పండ్లు తినవచ్చు. ఎందుకంటే పండ్లతో శరీరానికి అవసరమైన పీచు అందుతుంది.
(5 / 6)

స్మూతీలు రుచికరంగా ఉంటాయి, అవి క్షణంలో మీ కడుపును నింపుతాయి. కానీ చాలా స్మూతీస్ పండ్లతో తయారు చేస్తారు. ఫలితంగా దీనిలోని ఫ్రక్టోజ్ ఖాళీ కడుపుతో తినేటప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి ఉదయానికి బదులు.. మధ్యాహ్నం లేదా సాయంత్రం తీసుకోవచ్చు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి