తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tomatoes For Skin । మృదువైన, మెరిసే చర్మం కోసం టొమాటోలను ఇలా ఉపయోగించండి!

Tomatoes for Skin । మృదువైన, మెరిసే చర్మం కోసం టొమాటోలను ఇలా ఉపయోగించండి!

05 April 2023, 6:06 IST

Tomatoes for Skin: టొమాటోలు కేవలం తినడానికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని మనందరికీ తెలుసు. అయితే ఎలా ఉపయోగించాలో తెలుసా? ఇక్కడ చూసి తెలుసుకోండి.

  • Tomatoes for Skin: టొమాటోలు కేవలం తినడానికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని మనందరికీ తెలుసు. అయితే ఎలా ఉపయోగించాలో తెలుసా? ఇక్కడ చూసి తెలుసుకోండి.
 వేసవిలో టమోటాలు మీ చర్మంపై మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. ఇవి సన్ టాన్ లేదా నల్ల మచ్చలను తొలగించడానికి  ప్రభావవంతంగా ఉంటాయి.  టొమాటోలో పొటాషియం,  విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. టొమాటోలో ఉండే లైసోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మంపై మచ్చలు, ముడతలు పోగొట్టి మృదువుగా చేస్తుంది. టమోటాలను ఎలా ఉపయోగించాలో చూడండి. 
(1 / 5)

వేడి, చెమట, దుమ్ము ధూళి కారణంగా ముఖం జిడ్డుగా నిస్తేజంగా కనిపిస్తుంది. టొమాటో రసాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు ఉంచాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ముఖం శుభ్రంగా మారుతుంది. 
(2 / 5)

టమోటా రసం, దోసకాయ రసం,  నిమ్మరసం మూడు సమపాళ్లలో కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మెడ, చేతులు, పాదాలకు రాయండి. అది ఆరిన తర్వాత, మీ చేతులతో స్క్రబ్ చేయండి. చివరగా తడి టవల్ తో తుడవండి. చర్మం మెరుస్తుంది. 
(3 / 5)

టొమాటో గుజ్జులో పుల్లని పెరుగు కలపండి. ఆపై దీనిని ముఖం అంతా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కావాలంటే ఈ ప్యాక్‌లో రోజ్ వాటర్ కూడా కలపవచ్చు. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2-3 రోజులు కొన్ని నెలల పాటు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. 
(4 / 5)

టొమాటోలోని ఎంజైమ్‌లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి, మృతకణాలను తొలగిస్తాయి. టొమాటోలను సగానికి కట్ చేసి వాటిపై బ్రౌన్ షుగర్ చల్లండి. ఇప్పుడు దానిని ముఖం, మెడపై నెమ్మదిగా రుద్దండి. ఈ విధంగా మీరు మొత్తం శరీరాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయవచ్చు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి