తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Brahmotsavam : తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తజనసంద్రంగా తిరువీధులు

Tirumala Brahmotsavam : తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తజనసంద్రంగా తిరువీధులు

19 October 2023, 21:13 IST

Navaratri Brahmotsavams at Tirumala 2023 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సాయంత్రం…. శ్రీ మలయప్పస్వామి గరుడ వాహనంపై కటాక్షించారు. భారీగా భక్తుల రాకతో తిరువీధులు…శ్రీవారి నామస్మరణంతో మార్మోగాయి.

  • Navaratri Brahmotsavams at Tirumala 2023 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సాయంత్రం…. శ్రీ మలయప్పస్వామి గరుడ వాహనంపై కటాక్షించారు. భారీగా భక్తుల రాకతో తిరువీధులు…శ్రీవారి నామస్మరణంతో మార్మోగాయి.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు.
(1 / 8)

గరుడ సేవను వీక్షించేందుకు లక్షలాది మంది తిరుమలకు పోటెత్తారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య గురువారం సాయంత్రం శ్రీవారి గరుడసేవ ప్రారంభమైంది.
(2 / 8)

ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందు వెళ్తుండగా.. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. భారీగా తరలివచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో తిరువీధులు మార్మోగాయి.
(3 / 8)

గరుడసేవ ఊరేగింపు సమయంలో స్వామి ఆలయాన్ని వీడి తిరువీధులలో సంచరిస్తారని భక్తుల నమ్మకం. అందుకే అశేష సంఖ్యలో భక్తులు గరుడసేవకు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాక గరుత్మంతుడు నిత్యసూరి, స్వామికి దాసుడు, సఖుడు, వాహనం, పతాక చిహ్నం, గరుత్మంతునికి తెలియని స్వామి రహస్యాలుండవు.
(4 / 8)

గరుడసేవలో స్వామిని దర్శిస్తే కోర్కెలు తీరుతాయని, ముల్లోకాలదేవతలు కూడా గరుడసేవలో, ముల్లోకాల దేవతలు కూడా గరుడసేవలో స్వామివారిని దర్శించడానికి వస్తారని భక్తుల నమ్మకం.
(5 / 8)

చెన్నై నుండి గరుడోత్సవంనాడు నూతన గొడుగులను సమర్పించే విధానం అనాదిగా వస్తోంది. భక్తిశ్రద్ధలతో ఈ గొడుగులను తయారుచేసి చెన్నై నుండి ఐదు రోజుల పాటు పాదయాత్రతో తిరుమలకు చేరుకుంటారు.
(6 / 8)

ఆలయం ప్రదక్షిణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు గొడుగులను అప్పగిస్తారు. వీటిలో రెండు స్వర్ణకాంతులు, మరో ఏడు శ్వేత కాంతులతో ఉంటాయి.
(7 / 8)

 శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.6వ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్పస్వామి పుష్పకవిమానం విహ‌రిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి