తెలుగు న్యూస్  /  ఫోటో  /  Peru's Alien Mummy: ‘‘గ్రహాంతర వాసులు కాదు.. ఎముకలతో చేసిన బొమ్మలు..’’

Peru's alien mummy: ‘‘గ్రహాంతర వాసులు కాదు.. ఎముకలతో చేసిన బొమ్మలు..’’

14 January 2024, 15:24 IST

Peru's alien mummy: పెరూలో ఇటీవల వింత అస్థిపంజరాలు బయటపడ్డాయి. అవి గ్రహాంతర వాసులవి అన్న వాదన మొదలైంది. అవి ‘ఏలియన్ మమ్మీ’లన్నప్రచారం జోరుగా సాగింది. సైంటిస్ట్ ల పరిశోధనలో అవి ఎముకలతో చేసిన బొమ్మలని తేలడం కొసమెరుపు. 

పెరూలో సంచలనం సృష్టించిన 'ఏలియన్ మమ్మీ' సిద్ధాంతాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. శాస్త్రీయ విశ్లేషణ తర్వాత, నిపుణులు గత ఏడాది అక్టోబర్‌లో పెరూ రాజధానిలోని లిమా విమానాశ్రయంలో కనుగొనబడిన ఒక జత 'గ్రహాంతర మమ్మీలు' వాస్తవానికి భూమి జంతువుల ఎముకలతో తయారు చేయబడ్డాయని తెలిపారు. ఇందులో మనుషుల ఎముకలు కూడా ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.
(1 / 5)

గత ఏడాది లిమా విమానాశ్రయంలోని కొరియర్ కంపెనీ కార్యాలయం నుంచి ప్రత్యేకమైన సాంప్రదాయ దుస్తులు ధరించిన మమ్మీలా ఉన్న రెండు రాతి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అవిగ్రహాంతరవాసుల ‘మమ్మీలు’ ఉండొచ్చని పలు వర్గాల్లో పుకార్లు మొదలయ్యాయి. 
(2 / 5)

గత ఏడాది సెప్టెంబరులో రెండు చిన్న మమ్మీ మృతదేహాలను గుర్తించారు. ఈ రెండు విగ్రహాల తలలు చాలా పెద్దగా ఉన్నాయి. చేతికి మూడు వేళ్లు ఉన్నాయి. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. మెక్సికన్ జర్నలిస్ట్ జైమ్ మౌసన్ వారు 1,000 సంవత్సరాల వయస్సు గలవారని, 2017లో పెరూకి వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే, చాలా మంది నిపుణులు ఆ సమాచారాన్ని కట్టుకథగా తోసిపుచ్చారు.
(3 / 5)

ఆ రెండు బొమ్మలు మానవ శరీరాకారంలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. బొమ్మలు బహుశా మానవ మరియు జంతువుల ఎముకలతో తయారు చేసి ఉండవచ్చని తెలిపారు. వీటికి గ్రహాంతరవాసులకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
(4 / 5)
ఆ రెండు బొమ్మలు మానవ శరీరాకారంలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. బొమ్మలు బహుశా మానవ మరియు జంతువుల ఎముకలతో తయారు చేసి ఉండవచ్చని తెలిపారు. వీటికి గ్రహాంతరవాసులకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.(AFP)
పెరూస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లీగల్ మెడిసిన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్‌కు చెందిన ఆర్కియాలజిస్ట్ ఫ్లాబియో ఎస్ట్రాడా ఆ విగ్రహాలు గ్రహాంతరవాసులవి కాదని స్పష్టం చేశారు. అవి నిజానికి తోలుబొమ్మలని, సింథటిక్ గ్లూని ఉపయోగించి జంతువుల ఎముకలతో తయారు చేసిన బొమ్మలని తెలిపారు.
(5 / 5)
పెరూస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లీగల్ మెడిసిన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్‌కు చెందిన ఆర్కియాలజిస్ట్ ఫ్లాబియో ఎస్ట్రాడా ఆ విగ్రహాలు గ్రహాంతరవాసులవి కాదని స్పష్టం చేశారు. అవి నిజానికి తోలుబొమ్మలని, సింథటిక్ గ్లూని ఉపయోగించి జంతువుల ఎముకలతో తయారు చేసిన బొమ్మలని తెలిపారు.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి