తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bp Control: వేసవిలో బీపీ పెరగకుండా అదుపులో ఉండాలంటే వీటిని తినండి

BP Control: వేసవిలో బీపీ పెరగకుండా అదుపులో ఉండాలంటే వీటిని తినండి

03 May 2024, 13:44 IST

BP Control: అధిక రక్తపోటు బాధపడే వారి సంఖ్య ఎక్కువే.  మీ బీపీని అదుపులో ఉంచుకునేందుకు వేసవిలో కచ్చితంగా కొన్ని రకాల ఆహారాలను తినాలి. 

  • BP Control: అధిక రక్తపోటు బాధపడే వారి సంఖ్య ఎక్కువే.  మీ బీపీని అదుపులో ఉంచుకునేందుకు వేసవిలో కచ్చితంగా కొన్ని రకాల ఆహారాలను తినాలి. 
ఎండాకాలంలో ప్రజలు తరచూ అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. రక్తపోటు విషయంలో కొంచెం అజాగ్రత్త ఉంటే అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారానలు ప్రతిరోజూ తినాలి.
(1 / 10)

అధిక రక్తపోటు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ ప్రధాన కారణాలు మాత్రం అధికంగా ఉప్పు తినడం, పొటాషియం తక్కువగా ఉండే ఆహారాన్ని తినడం , అధికంగా మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి బారిన పడడం వంటివి.
(2 / 10)

అధిక రక్తపోటు వల్ల గుండె సమస్యలు వస్తాయి. రక్తనాళాలను దెబ్బతీస్తాయి. మూత్రపిండాల వైఫల్యం, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
(3 / 10)

అరటిపండ్లలో ఉండే పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం రక్తపోటును తగ్గించడం ద్వారా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి, ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.
(4 / 10)

పెరుగులో పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది.
(5 / 10)

దానిమ్మలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. బీపీ లెవల్స్ నార్మల్ గా ఉండాలంటే రోజూ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగాలి.
(6 / 10)

వేసవిలో కొబ్బరి నీరు తాగడం చాలా అవసరం. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకుంటూ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
(7 / 10)

వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరాన్ని చల్లబరచడమే కాకుండా హైబీపీని అదుపులో ఉంచుతుంది. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. దీన్ని ప్రతి రోజూ తింటే వేసవిలో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అంతేకాకుండా పుచ్చకాయలో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
(8 / 10)

విటమిన్ సితో పాటు, నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ తొలగించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
(9 / 10)

అధిక రక్తపోటుతో బాధపడేవారు నేరేడు పండ్లను  డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించి శరీరానికి అవసరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి