తెలుగు న్యూస్  /  ఫోటో  /  Magnesium Rich Foods: మెగ్నిషియం మెండుగా ఉండే ఆహారాలు ఇవి.. తప్పక తినాల్సిందే!

Magnesium Rich Foods: మెగ్నిషియం మెండుగా ఉండే ఆహారాలు ఇవి.. తప్పక తినాల్సిందే!

02 December 2024, 19:40 IST

Magnesium Rich Foods: శరీరానికి మెగ్నిషియం చాలా ముఖ్యం. ఈ మినరల్ లోపం ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాలు ఏవంటే..

  • Magnesium Rich Foods: శరీరానికి మెగ్నిషియం చాలా ముఖ్యం. ఈ మినరల్ లోపం ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాలు ఏవంటే..
శరీరంలో మెగ్నిషియం లోపం ఉంటే కొన్ని ఆరోగ్యానికి సమస్యలు ఎదురవుతాయి. నీరసం, వికారం, కండరాల నొప్పులు, అలసట లాంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకే మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తినాలి. అవేంటో ఇక్కడ చూడండి. 
(1 / 7)
శరీరంలో మెగ్నిషియం లోపం ఉంటే కొన్ని ఆరోగ్యానికి సమస్యలు ఎదురవుతాయి. నీరసం, వికారం, కండరాల నొప్పులు, అలసట లాంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకే మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఆహారాలు తినాలి. అవేంటో ఇక్కడ చూడండి. (Unsplash)
బాదం, జీడిపప్పు, బ్రెజిల్ నట్స్‌లో మెగ్నిషియం మెండుగా ఉంటుంది. ఇవి తింటే శరీరానికి ఈ మినరల్ బాగా అందుతుంది. కీలకమైన విటమిన్లతో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు వీటిలో మెండుగా ఉంటాయి. 
(2 / 7)
బాదం, జీడిపప్పు, బ్రెజిల్ నట్స్‌లో మెగ్నిషియం మెండుగా ఉంటుంది. ఇవి తింటే శరీరానికి ఈ మినరల్ బాగా అందుతుంది. కీలకమైన విటమిన్లతో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు వీటిలో మెండుగా ఉంటాయి. (Freepik)
అవకాడోలో మెగ్నిషియం అధికం. ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మెగ్నిషియం లోపం ఉన్న వారు అవకాడో తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 
(3 / 7)
అవకాడోలో మెగ్నిషియం అధికం. ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మెగ్నిషియం లోపం ఉన్న వారు అవకాడో తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. (Pixabay)
శనగలు, బీన్స్, సోయాబీన్స్, పప్పులు, పచ్చి బఠానీ లాంటి కాయధాన్యాల్లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే శరీరానికి ఈ పోషకం బాగా అందుతుంది. లోపం తగ్గిపోతుంది. 
(4 / 7)
శనగలు, బీన్స్, సోయాబీన్స్, పప్పులు, పచ్చి బఠానీ లాంటి కాయధాన్యాల్లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే శరీరానికి ఈ పోషకం బాగా అందుతుంది. లోపం తగ్గిపోతుంది. (Pexels)
గుమ్మడి, అవిసె, చియా విత్తనాల్లోనూ మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. క్వినోవా, బార్లీ లాంటి చిరుధాన్యాల్లోనూ ఈ పోషకం బాగా లభిస్తుంది. 
(5 / 7)
గుమ్మడి, అవిసె, చియా విత్తనాల్లోనూ మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. క్వినోవా, బార్లీ లాంటి చిరుధాన్యాల్లోనూ ఈ పోషకం బాగా లభిస్తుంది. 
డార్క్ చాక్లెట్‍లోనూ మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెగ్నిషియం లోపం తగ్గుతుంది. 
(6 / 7)
డార్క్ చాక్లెట్‍లోనూ మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెగ్నిషియం లోపం తగ్గుతుంది. 
అరటి, బ్లూబెర్రీ, జామపండ్లలోనూ మెగ్నిషియం మెండుగా ఉంటుంది. వీటిలోని పోషకాలు పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. 
(7 / 7)
అరటి, బ్లూబెర్రీ, జామపండ్లలోనూ మెగ్నిషియం మెండుగా ఉంటుంది. వీటిలోని పోషకాలు పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. 

    ఆర్టికల్ షేర్ చేయండి