తెలుగు న్యూస్  /  ఫోటో  /  Diabetes: ప్రతిరోజూ ఈ డ్రింక్ తాగారంటే షుగర్ లెవెల్స్ పెరగనే పెరగవు

Diabetes: ప్రతిరోజూ ఈ డ్రింక్ తాగారంటే షుగర్ లెవెల్స్ పెరగనే పెరగవు

21 September 2024, 9:00 IST

భారతీయ వంటల్లో కరివేపాకుది ప్రత్యేక స్థానం. కరివేపాకులు వేస్తే ఎన్నో వంటకాలకు ప్రత్యేక రుచి వస్తుంది.  కరివేపాకులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రింక్ తాగితే షుగర్ అదుపులో ఉండడం ఖాయం.    

భారతీయ వంటల్లో కరివేపాకుది ప్రత్యేక స్థానం. కరివేపాకులు వేస్తే ఎన్నో వంటకాలకు ప్రత్యేక రుచి వస్తుంది.  కరివేపాకులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ డ్రింక్ తాగితే షుగర్ అదుపులో ఉండడం ఖాయం.    
కరివేపాకులు వేస్తే  సాంబార్, రసం, చట్నీలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. కరివేపాకు కషాయాన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం నుండి డయాబెటిస్ నియంత్రణ వరకు కరివేపాకు నానబెట్టిన నీరు ఆరోగ్యంపై ఎలా పనిచేస్తుందో చూడండి. 
(1 / 8)
కరివేపాకులు వేస్తే  సాంబార్, రసం, చట్నీలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. కరివేపాకు కషాయాన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం నుండి డయాబెటిస్ నియంత్రణ వరకు కరివేపాకు నానబెట్టిన నీరు ఆరోగ్యంపై ఎలా పనిచేస్తుందో చూడండి. (shutterstock)
కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ,  ఫైబర్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 
(2 / 8)
కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ,  ఫైబర్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. (shutterstock)
కరివేపాకులో ఉండే హైపోగ్లైసీమిక్ గుణం శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకును నీటిలో మరగబెట్టి తయారు చేసే కషాయాన్ని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్, హైబీపీని నియంత్రించడం ద్వారా గుండె జబ్బులను దూరం చేయడంలో సహాయపడుతుంది.
(3 / 8)
కరివేపాకులో ఉండే హైపోగ్లైసీమిక్ గుణం శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకును నీటిలో మరగబెట్టి తయారు చేసే కషాయాన్ని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్, హైబీపీని నియంత్రించడం ద్వారా గుండె జబ్బులను దూరం చేయడంలో సహాయపడుతుంది.(shutterstock)
కరివేపాకు నీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు,  దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి కాపాడతాయి.
(4 / 8)
కరివేపాకు నీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు,  దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి కాపాడతాయి.(shutterstock)
మీరు పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతుంటే బరువు తగ్గడానికి సరైన మార్గం ప్రతి రోజూ కరివేపాకు కషాయం తాగడం.  కరివేపాకులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది శరీరం కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. కరివేపాకులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ బరువు పెరగకుండా నివారిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీని నీరు శరీరం నుండి హానికరమైన విషాన్ని తొలగించడం ద్వారా అదనపు కొవ్వును కరిగిస్తుంది. 
(5 / 8)
మీరు పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతుంటే బరువు తగ్గడానికి సరైన మార్గం ప్రతి రోజూ కరివేపాకు కషాయం తాగడం.  కరివేపాకులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది శరీరం కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. కరివేపాకులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ బరువు పెరగకుండా నివారిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీని నీరు శరీరం నుండి హానికరమైన విషాన్ని తొలగించడం ద్వారా అదనపు కొవ్వును కరిగిస్తుంది. (shutterstock)
కరివేపాకు నీటిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తంలో మంచి ఆక్సిజన్, హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
(6 / 8)
కరివేపాకు నీటిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తంలో మంచి ఆక్సిజన్, హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.(shutterstock)
కరివేపాకు జీర్ణశక్తిని బలపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. కరివేపాకులో ఉండే మంచి ఫైబర్ అనేక జీర్ణకోశ సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపణ అయింది. దీని ఆకుల్లో ఉండే పోషకాలు మలబద్ధకం, విరేచనాలు, పైల్స్, వికారం, వాపు మొదలైన వాటిని నివారించడంలో సహాయపడతాయి.
(7 / 8)
కరివేపాకు జీర్ణశక్తిని బలపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. కరివేపాకులో ఉండే మంచి ఫైబర్ అనేక జీర్ణకోశ సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపణ అయింది. దీని ఆకుల్లో ఉండే పోషకాలు మలబద్ధకం, విరేచనాలు, పైల్స్, వికారం, వాపు మొదలైన వాటిని నివారించడంలో సహాయపడతాయి.(shutterstock)
కరివేపాకు డ్రింక్ తయారు చేయడానికి గ్లాసు నీళ్లలో గుప్పెడు కరివేపాకు వేసి బాగా  మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని వడగట్టి ఒక పాత్రలోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి.  ఆ నీటిని తాగాలి.
(8 / 8)
కరివేపాకు డ్రింక్ తయారు చేయడానికి గ్లాసు నీళ్లలో గుప్పెడు కరివేపాకు వేసి బాగా  మరిగించి కషాయం తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని వడగట్టి ఒక పాత్రలోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి.  ఆ నీటిని తాగాలి.(shutterstock)

    ఆర్టికల్ షేర్ చేయండి