తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hmda Ftl Buffer Zones : ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటున్నారా..? ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ ఇలా చెక్‌ చేసుకోండి

HMDA FTL Buffer Zones : ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటున్నారా..? ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ ఇలా చెక్‌ చేసుకోండి

12 October 2024, 9:13 IST

HMDA FTL Buffer Zone Maps : హైడ్రా వ్యవస్థ తర్వాత హెచ్ఎండీఏ పరిధిలో ఇళ్లు, ప్లాట్లు కొనే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు HMDA ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • HMDA FTL Buffer Zone Maps : హైడ్రా వ్యవస్థ తర్వాత హెచ్ఎండీఏ పరిధిలో ఇళ్లు, ప్లాట్లు కొనే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు HMDA ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ లాంటి పెద్దపెద్ద నగరాల్లో స్థలాలకు, ఇళ్లకు, ఫ్లాట్​లకు భారీగా డిమాండ్ ఉంటుంది. శివారు ప్రాంతాల్లో కూడా ఇదే రేంజ్ ఉంటుంది.  అయితే కొంత మంది రియల్​ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల్లో, నాలాల్లో, అటవీ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తుంటారు. ఇలాంటి వాటిని కొని చాలా మంది నష్టపోతుంటారు. 
(1 / 6)

చెరువులు, నాలాల రక్షణే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. చెరువులు, నాలాల పరిధిలో నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లు లేదా స్థలాలు కొనుగోళ్లు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 
(2 / 6)

ముఖ్యమంగా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ వివరాలు తెలుసుకోవాలి. ఈ వివరాలను సింపుల్ గా తెలుసుకునేందుకు వీలుగా HMDA ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఎండీఏకు చెందిన https://lakes.hmda.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెరువుల వివరాలతో పాటీ ఎఫీటీఎల్, బపర్ జోన్ మ్యాప్ లను పొందవచ్చు. ఫలితంగా ఓ అంచనాకు రావొచ్చు. 
(3 / 6)

పైన పేర్కొన్న వెబ్ సైట్ లోకి వెళ్తే… జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్‌ చేసుకోవాలి. సర్వే నంబరును ఎంట్రీ చేస్తే ఆ ఊరిలోని అన్ని చెరువుల వివరాలు తెలుసుకోవచ్చు. ఎఫ్‌టీఎల్‌ కాలమ్ కూడా ఉంటుంది. క్లిస్ చేస్తే  మ్యాప్‌ ఓపెన్‌ అవుతుంది. 
(4 / 6)

ఇదే వెబ్ సైట్ లో క్యాడస్ట్రల్‌ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేస్తే మరో మ్యాపు ఓపెన్‌ అవుతుంది. దీంతో ఆ చెరువు ఏయే సర్వే నంబర్ల పరిధిలో ఉందో తెలుస్తుంది. మ్యాప్‌లో నీలి రంగు లైన్‌తో ఉన్నది ఎఫ్‌టీఎల్‌ పరిధిని సూచిస్తుంది. ఆ పక్కనే రెడ్‌ కలర్‌తో ఉన్నదే బఫర్‌జోన్‌. 
(5 / 6)

ఆరెంజ్‌ కలర్‌తో ఉండేది చెరువు కట్టను సూచిస్తుంది. ఈ మ్యాప్ వివరాలు, రంగులను బట్టి… మీరు కొనుగోలు చేయబోయే ప్లాట్ లేదా ఇళ్లు ఏ పరిధిలో ఉందనే విషయంపై ఓ అంచనాకు రావొచ్చు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి