తెలుగు న్యూస్  /  ఫోటో  /  Diwali Precautions : దీపావళి టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Diwali Precautions : దీపావళి టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

30 October 2024, 16:39 IST

Diwali Precautions : దీపావళి అంటే ముందు గుర్తొచ్చేది టపాసులు. బాణాసంచా కాల్చేటప్పుడు తగిన భద్రతా సూచనలు పాటించాలి. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

ఈ ఏడాది అక్టోబర్ 31 దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. దీపావళి అంటే ముందు గుర్తొచ్చేది టపాసులు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దీపావళి నాడు టపాసులు కాల్చి ఎంతో సంబరంగా పండుగ జరుపుకుంటారు. అయితే పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
(1 / 6)

దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు తగిన భద్రతా సూచనలు పాటించాలి. బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. మీ ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయండి. పసి పిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.
(2 / 6)

బాణసంచా కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ ఒక బకెట్ నీరు, ఇసుకను అందుబాటులో ఉంచుకోండి. బాణసంచాపై రాసిన సూచనలను జాగ్రత్తగా పాటించండి. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు టపాసులు కాల్చాలి. రాకెట్లు, ఫ్లవర్పాట్లు, ఇతర ఎగిరే క్రాకర్లను గడ్డితో చేసిన ఇళ్లు, ఎండుగడ్డి ఉండే ప్రాంతాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చాలి. మీకు ప్రమాదవశాత్తూ గాయలైనట్లయితే చల్లటి నీటిని గాయాన్ని కడిగి వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 
(3 / 6)

దీపావళి టపాసులతో ప్రయోగాలు చేయవద్దు. అవి కాల్చేపుడు మీ ముఖానికి దూరంగా ఉంచుకోవాలి. టపాసులు సరిగ్గా కాలకపోతే...మళ్లీ వాటిని వెలిగించే ప్రయత్నం చేయవద్దు.
(4 / 6)

విద్యుత్ స్తంభాల దగ్గరగా బాణసంచా కాల్చవద్దు. ఫ్లవర్పాట్లు, హ్యాండ్ బాంబ్లు వంటి బాణాసంచాను కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు. ఫైర్ క్రాకర్లను వెలిగించి రోడ్లపై ఎక్కడి పడితే అక్కడ బహిరంగంగా విసిరేయకండి. క్రాకర్స్ నుంచి వచ్చే పొగకు దూరంగా ఉండండి. దోమలు పోతాయని ఇంట్లో మతాబులు కాల్చడం వంటి చేయకండి. 
(5 / 6)

అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 నెంబర్లను సంప్రదించండి.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి