తెలుగు న్యూస్  /  ఫోటో  /  Devi Navaratri Utsavalu : నర్సంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు!

Devi Navaratri Utsavalu : నర్సంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు!

03 October 2024, 14:31 IST

Devi Navaratri Utsavalu : తెలంగాణ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ అందరినీ ఆకర్షిస్తోంది.

  • Devi Navaratri Utsavalu : తెలంగాణ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్ అందరినీ ఆకర్షిస్తోంది.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల లైట్లతో అలంకరించారు. 
(1 / 5)
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల లైట్లతో అలంకరించారు. (HT Telugu)
నర్సంపేట పట్టణంలోని వల్లభ్‌నగర్‌లో అయోధ్య రామమందిరం ప్రతిభింబించేలా వేదికను ఏర్పాటు చేశారు. రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
(2 / 5)
నర్సంపేట పట్టణంలోని వల్లభ్‌నగర్‌లో అయోధ్య రామమందిరం ప్రతిభింబించేలా వేదికను ఏర్పాటు చేశారు. రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.(HT Telugu)
అమ్మవారిని ప్రతిష్టించేందుకు ఆలయాన్ని రూపొందించారు. అచ్చం అయోధ్య రామమందిరంలా దీన్ని తీర్చిదిద్దారు. ఆ ఆలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు.
(3 / 5)
అమ్మవారిని ప్రతిష్టించేందుకు ఆలయాన్ని రూపొందించారు. అచ్చం అయోధ్య రామమందిరంలా దీన్ని తీర్చిదిద్దారు. ఆ ఆలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు.(HT Telugu)
ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయం ముందే బతుకమ్మ సంబరాలు ప్రారంభం అయ్యాయి. మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలతో వచ్చారు. ఆలయం ప్రాంగణంలో ఆట, పాటలతో సందడి చేశారు. 
(4 / 5)
ఇక్కడ ఏర్పాటు చేసిన ఆలయం ముందే బతుకమ్మ సంబరాలు ప్రారంభం అయ్యాయి. మహిళలు పెద్దఎత్తున బతుకమ్మలతో వచ్చారు. ఆలయం ప్రాంగణంలో ఆట, పాటలతో సందడి చేశారు. (HT Telugu)
ఇటు నర్సంపేట పట్టణం మొత్తం విద్యుత్ కాంతులతో నిండిపోయింది. బస్టాండ్ కూడలిలో ఉన్న కాకతీయ కళా తోరణాన్ని లైట్లతో అలంకరించారు. అది స్పషల్ అట్రాక్షన్‌గా నిలించింది.
(5 / 5)
ఇటు నర్సంపేట పట్టణం మొత్తం విద్యుత్ కాంతులతో నిండిపోయింది. బస్టాండ్ కూడలిలో ఉన్న కాకతీయ కళా తోరణాన్ని లైట్లతో అలంకరించారు. అది స్పషల్ అట్రాక్షన్‌గా నిలించింది.(HT Telugu)

    ఆర్టికల్ షేర్ చేయండి