తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Top Engineering Colleges : బీటెక్ ప్రవేశాలు...తెలంగాణలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలివే..!

TG Top Engineering Colleges : బీటెక్ ప్రవేశాలు...తెలంగాణలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలివే..!

23 May 2024, 19:03 IST

Top Engineering Colleges in Telangana : తెలంగాణ ఎంసెట్(TS EAPCET) 2024 ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ర్యాంకులు విడుదల కావటంతో… టాప్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి విద్యార్థులు సెర్చ్ చేస్తుంటారు. అలాంటి కాలేజీలకు సంబంధించిన కొన్ని వివరాలను ఇక్కడ చూడండి…..

  • Top Engineering Colleges in Telangana : తెలంగాణ ఎంసెట్(TS EAPCET) 2024 ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ర్యాంకులు విడుదల కావటంతో… టాప్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి విద్యార్థులు సెర్చ్ చేస్తుంటారు. అలాంటి కాలేజీలకు సంబంధించిన కొన్ని వివరాలను ఇక్కడ చూడండి…..
తెలంగాణ ఎంసెట్(TS EAPCET 2024) ఫలితాలు విడుదల కావటంతో విద్యార్థులు అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు. తమ ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీ అయితే బెటర్ అన్నదానిపై క్లారిటీ తీసుకునే పనిలో పడ్డారు. ఏ క్షణమైనా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో…. ముందుగానే కాలేజీల ఎంపికపై స్పష్టత ఉండాలని భావిస్తున్నారు.
(1 / 7)
తెలంగాణ ఎంసెట్(TS EAPCET 2024) ఫలితాలు విడుదల కావటంతో విద్యార్థులు అప్పుడే కసరత్తు మొదలుపెట్టారు. తమ ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీ అయితే బెటర్ అన్నదానిపై క్లారిటీ తీసుకునే పనిలో పడ్డారు. ఏ క్షణమైనా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో…. ముందుగానే కాలేజీల ఎంపికపై స్పష్టత ఉండాలని భావిస్తున్నారు.(photo source https://unsplash.com/)
అయితే ప్రతి ఏడాది కూడా సీఎస్‌ఈ చాలా డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే…. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉండే విద్యార్థులు… కంప్యూటర్ సైన్స్ కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
(2 / 7)
అయితే ప్రతి ఏడాది కూడా సీఎస్‌ఈ చాలా డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే…. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉండే విద్యార్థులు… కంప్యూటర్ సైన్స్ కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.(photo source https://unsplash.com/)
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ : టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ఒకటిగా ఉంది. ఇక్కడ ప్లేస్ మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గతంలో ఇక్కడ విద్యను పూర్తి చేసిన వాళ్లు… పలు అంతర్జాతీయ కంపెనీలకు సీఈవోలుగా పని చేస్తున్నారు. 
(3 / 7)
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ : టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ఒకటిగా ఉంది. ఇక్కడ ప్లేస్ మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గతంలో ఇక్కడ విద్యను పూర్తి చేసిన వాళ్లు… పలు అంతర్జాతీయ కంపెనీలకు సీఈవోలుగా పని చేస్తున్నారు. (photo source https://unsplash.com/)
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ : ఇది హైదరాబాద్ లో ఉంది. ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ. ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రసిద్ధి చెందిన కళాశాలగా గుర్తింపు పొందింది. ఇక్కడ సీటు రావాలంటే… 2వేల లోపు ఉండాల్సిందే. రిజర్వేషన్లను బట్టి మారొచ్చు. ప్రతి ఏడాది కూడా కటాఫ్ మారిపోతుంటుంది.
(4 / 7)
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ : ఇది హైదరాబాద్ లో ఉంది. ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ. ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రసిద్ధి చెందిన కళాశాలగా గుర్తింపు పొందింది. ఇక్కడ సీటు రావాలంటే… 2వేల లోపు ఉండాల్సిందే. రిజర్వేషన్లను బట్టి మారొచ్చు. ప్రతి ఏడాది కూడా కటాఫ్ మారిపోతుంటుంది.(photo source https://unsplash.com/)
CBIT:  సీబీఐటీ… ఇంజినీరింగ్ లో చాలా టాప్ కాలేజీ. ఇది ప్రైవేట్ కాలేజీ. హైదరాబాద్ లోని గండిపేటలో ఉంటుంది. ఇక్కడ్నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసే మంచి భవిష్యత్ ఉంటుంది. ప్లేస్ మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.1979లో ఈ కాలేజీని స్థాపించారు. ఈ కాలేజీలో కూడా సీటు పొందాలంటే 2500లోపు ర్యాంక్ రావాల్సిందే. ఈ సంఖ్య నిర్దిష్టమైనది కాదు. విద్యార్థుల చేరికను బట్టి మారొచ్చు.
(5 / 7)
CBIT:  సీబీఐటీ… ఇంజినీరింగ్ లో చాలా టాప్ కాలేజీ. ఇది ప్రైవేట్ కాలేజీ. హైదరాబాద్ లోని గండిపేటలో ఉంటుంది. ఇక్కడ్నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసే మంచి భవిష్యత్ ఉంటుంది. ప్లేస్ మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.1979లో ఈ కాలేజీని స్థాపించారు. ఈ కాలేజీలో కూడా సీటు పొందాలంటే 2500లోపు ర్యాంక్ రావాల్సిందే. ఈ సంఖ్య నిర్దిష్టమైనది కాదు. విద్యార్థుల చేరికను బట్టి మారొచ్చు.(photo source https://unsplash.com/)
నాదర్ గుల్ లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీకి మంచి పేరుంది. ఇక్కడ చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ సీటు రావాలంటే మంచి ర్యాంక్ రావాల్సిందే. ఇవే కాకుండా.... హైదరాబాద్ చుట్టపక్కన ఉన్న వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH కాలేజీలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. శంషాబాద్ ప్రాంతంలో ఉన్న వర్ధమాన్ కాలేజీ కూడా ఇంజినీరింగ్ విద్యకు మంచి ఆప్షన్. 
(6 / 7)
నాదర్ గుల్ లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీకి మంచి పేరుంది. ఇక్కడ చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ సీటు రావాలంటే మంచి ర్యాంక్ రావాల్సిందే. ఇవే కాకుండా.... హైదరాబాద్ చుట్టపక్కన ఉన్న వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECH కాలేజీలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. శంషాబాద్ ప్రాంతంలో ఉన్న వర్ధమాన్ కాలేజీ కూడా ఇంజినీరింగ్ విద్యకు మంచి ఆప్షన్. 
పై కాలేజీల వివరాలు కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. ఎంసెట్ లో వచ్చిన ర్యాంకుతో పాటు వెబ్ ఆప్షన్లలో ఎంచుకునే కాలేజీల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థులు నేరుగా చేరాలనుకునే కాలేజీల సమాచారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ నుంచి కూడా పొందవచ్చు. లేదా జేఎన్టీయూ వెబ్ సైట్ లోకి వెళ్లి అనుబంధంగా ఉన్న కాలేజీల సమాచారం తెలుసుకోవచ్చు. 
(7 / 7)
పై కాలేజీల వివరాలు కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. ఎంసెట్ లో వచ్చిన ర్యాంకుతో పాటు వెబ్ ఆప్షన్లలో ఎంచుకునే కాలేజీల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థులు నేరుగా చేరాలనుకునే కాలేజీల సమాచారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ నుంచి కూడా పొందవచ్చు. లేదా జేఎన్టీయూ వెబ్ సైట్ లోకి వెళ్లి అనుబంధంగా ఉన్న కాలేజీల సమాచారం తెలుసుకోవచ్చు. (unshplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి