తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bharat Jodo Nyay Yatra: మణిపూర్ లో ముగిసిన రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’

Bharat Jodo Nyay Yatra: మణిపూర్ లో ముగిసిన రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’

17 January 2024, 17:47 IST

Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నాలుగో రోజుకు చేరింది. ఈ యాత్ర మణిపూర్ లో ముగిసి, ప్రస్తుతం నాగాలాండ్ లో కొనసాగుతోంది. యాత్ర నాలుగో రోజు రాహుల్ గాంధీ నాగాలాండ్ రాజధాని కోహిమాలో యాత్ర కొనసాగించారు.

  • Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నాలుగో రోజుకు చేరింది. ఈ యాత్ర మణిపూర్ లో ముగిసి, ప్రస్తుతం నాగాలాండ్ లో కొనసాగుతోంది. యాత్ర నాలుగో రోజు రాహుల్ గాంధీ నాగాలాండ్ రాజధాని కోహిమాలో యాత్ర కొనసాగించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' బుధవారం నాగాలాండ్‌లోకి ప్రవేశించింది, ఈ యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
(1 / 9)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' బుధవారం నాగాలాండ్‌లోకి ప్రవేశించింది, ఈ యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.(ANI)
బస్సులో యాత్ర ను కొనసాగిస్తూ మధ్యమధ్యలో చిన్న చిన్న బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు.
(2 / 9)
బస్సులో యాత్ర ను కొనసాగిస్తూ మధ్యమధ్యలో చిన్న చిన్న బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు.(PTI)
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దారి పొడవునా స్థానికులు ఆయనను కలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
(3 / 9)
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దారి పొడవునా స్థానికులు ఆయనను కలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.(ANI)
యాత్ర సందర్భంగా బీజేపీపై, ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు, ఈ దేశాన్ని ఇద్దరే నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలోని 500 పెద్ద కంపెనీల్లో ఏ ఒక్కటి కూడా నాగాలాండ్ వారిది కాదన్నారు. 
(4 / 9)
యాత్ర సందర్భంగా బీజేపీపై, ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు, ఈ దేశాన్ని ఇద్దరే నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలోని 500 పెద్ద కంపెనీల్లో ఏ ఒక్కటి కూడా నాగాలాండ్ వారిది కాదన్నారు. (ANI)
నాగాలాండ్ లోని కోహిమాలో స్థానిక కుటుంబంతో కలిసి అల్పాహారం తీసుకుని తేనీరు సేవించారు.
(5 / 9)
నాగాలాండ్ లోని కోహిమాలో స్థానిక కుటుంబంతో కలిసి అల్పాహారం తీసుకుని తేనీరు సేవించారు.(ANI)
భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా మణిపూర్, నాగాలాండ్ లకు చెందిన స్థానిక కళాకారులు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కోహిమాలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ స్టేడియంను రాహుల్ సందర్శించారు.
(6 / 9)
భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా మణిపూర్, నాగాలాండ్ లకు చెందిన స్థానిక కళాకారులు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కోహిమాలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ స్టేడియంను రాహుల్ సందర్శించారు.(ANI)
‘‘ఈ ప్రాంతంలోని విభిన్న ఆలోచనలు, భాషలు, రాష్ట్రాలు, చరిత్రలు, సంస్కృతులకు గౌరవం ఇవ్వడానికే మేము ఈశాన్య రాష్ట్రాల నుండి ఈ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
(7 / 9)
‘‘ఈ ప్రాంతంలోని విభిన్న ఆలోచనలు, భాషలు, రాష్ట్రాలు, చరిత్రలు, సంస్కృతులకు గౌరవం ఇవ్వడానికే మేము ఈశాన్య రాష్ట్రాల నుండి ఈ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.(AICC)
‘‘ఈ యాత్రను పాద యాత్రగా కొనసాగించాలని నేను అనుకున్నాను. పాదయాత్ర చేయడమే నాకు ఇష్టం. కానీ సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల పార్టీ దీనిని హైబ్రిడ్ యాత్రగా చేయాలని నిర్ణయించింది" అని రాహుల్ గాంధీ వెల్లడించారు. 
(8 / 9)
‘‘ఈ యాత్రను పాద యాత్రగా కొనసాగించాలని నేను అనుకున్నాను. పాదయాత్ర చేయడమే నాకు ఇష్టం. కానీ సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల పార్టీ దీనిని హైబ్రిడ్ యాత్రగా చేయాలని నిర్ణయించింది" అని రాహుల్ గాంధీ వెల్లడించారు. (Congress X)
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర లో వివిధ వర్గాలకు చెందిన స్థానికులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
(9 / 9)
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర లో వివిధ వర్గాలకు చెందిన స్థానికులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి