తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Cyclone Alert: ఏపీ మళ్లీ తుఫాను ముప్పు, ఈసారి రాయలసీమ వంతు, ఐఎండి అంచనాలు…

AP Cyclone Alert: ఏపీ మళ్లీ తుఫాను ముప్పు, ఈసారి రాయలసీమ వంతు, ఐఎండి అంచనాలు…

11 October 2024, 6:31 IST

AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరో సారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరి తల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.క్రమంగా  అల్పపీడనంగా బలపడ నుంది. అది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయు గుండంగా రూపాంతరం చెంది, ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. 

  • AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరో సారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరి తల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.క్రమంగా  అల్పపీడనంగా బలపడ నుంది. అది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయు గుండంగా రూపాంతరం చెంది, ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. 
బంగాళఖాతంలో ఏర్పాడే అల్పపీడనం క్రమంగా  తుపానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
(1 / 7)

పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ,తూర్పుగోదావరి,ప్రకాశం,కర్నూలు, నంద్యాల,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని  కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది
(2 / 7)

ఏపీలో నేడు  శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, అనకాపల్లి,కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,పల్నాడు, నెల్లూరు, వైయస్ఆర్,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి  వర్షాలు కురిసే అవకాశం ఉంది
(3 / 7)

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని  కొన్ని వాతావరణ నమూనాలు  అంచనా వేస్తున్నాయి. అల్పపీడనం   తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. .
(4 / 7)

తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
(5 / 7)

మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బల పడింది. కర్ణాటక, గోవా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 
(6 / 7)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో సారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరి తల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి