తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు అలర్ట్, రైతులకు వానగండం

AP Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు అలర్ట్, రైతులకు వానగండం

26 November 2024, 7:59 IST

AP Heavy Rain Alert:  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. 

  • AP Heavy Rain Alert:  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. 
బంగాళాఖాతంay ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది.  తూర్పు హిందూ మహాసముద్రంపై తీవ్రఅల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై వాయుగుండంగా రూపాంతరం చెందిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 
(1 / 8)

 వాయుగుండం ప్రభావంతో శుక్రవారం 29వ తేది వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. 
(2 / 8)

దక్షిణ బంగాళాఖాతం,తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం, గడిచిన మూడు గంటల్లో గంటకు 30కిమీ వేగంతో కదులుతోంది. వాయుగుండం ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిమీ, నాగపట్నానికి 810 కిమీ, పుదుచ్చేరికి 920 కిమీ, చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం దీని ప్రభావంతో శుక్రవారం వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 
(3 / 8)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ  గంటకు 30కిమీ వేగంతో కదులుతోంది, ఇది ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిమీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 810 కిమీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 920 కిమీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని, ఆతర్వాత వచ్చే 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
(4 / 8)

వాయుగుండం నేపథ్యంలో  మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని,  దక్షిణకోస్తా తీరం వెంబడి రేపు గంటకు 50-70కిమీ వీచే అవకాశం ఉంది. బుధవారం నుంచి 55 -75కిమీ వేగంతో ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయి. ఈ  నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. 
(5 / 8)

వాయుగుండం ప్రభావంతో  నవంబర్ 26, మంగళవారం నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 27, బుధవారం నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
(6 / 8)

 రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచుకోవాలి ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
(7 / 8)

ఐఎండి అంచనాల ప్రకారం  వంబర్ 28, గురువారం నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 29, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి