తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Ts Weather Updates : వెదర్ అలర్ట్... ఈ రెండు రోజులు మరింత పొగమంచు - పలు జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

AP TS Weather Updates : వెదర్ అలర్ట్... ఈ రెండు రోజులు మరింత పొగమంచు - పలు జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

04 January 2024, 10:20 IST

Telangana and Andhrapradesh Weather Updates:  తెలుగు రాష్ట్రాల్లో చలితో పాటు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

  • Telangana and Andhrapradesh Weather Updates:  తెలుగు రాష్ట్రాల్లో చలితో పాటు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ రెండు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
తెలంగాణ , ఆంధప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు రోజుల పాటు అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
(1 / 5)
తెలంగాణ , ఆంధప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు రోజుల పాటు అత్యంత చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
చలి తీవ్రతతో పాటు ఈ రెండు రోజులు పొగ మంచు ఎఫెక్ట్  అత్యంత ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
(2 / 5)
చలి తీవ్రతతో పాటు ఈ రెండు రోజులు పొగ మంచు ఎఫెక్ట్  అత్యంత ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.(Twitter)
ఇవాళ (గురువారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు అధికంగా ఉంటాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 
(3 / 5)
ఇవాళ (గురువారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు అధికంగా ఉంటాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. (unsplash.com)
రేపు(శుక్రవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(4 / 5)
రేపు(శుక్రవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(Twitter)
ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కోస్తా ఆంధ్రా, యానం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఇవాళ, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని... కొన్నిచోట్ల మాత్రం పొగమంచు కురిసే అవకాశం ఉందని వివరించింది.
(5 / 5)
ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కోస్తా ఆంధ్రా, యానం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఇవాళ, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని... కొన్నిచోట్ల మాత్రం పొగమంచు కురిసే అవకాశం ఉందని వివరించింది.(Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి