HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Rain Alert : ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్

AP Rain Alert : ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్

17 September 2024, 16:16 IST

AP Rain Alert : ఇటీవల బీభత్సం సృష్టించిన వర్షాలు.. ఏపీని వదలడం లేదు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

  • AP Rain Alert : ఇటీవల బీభత్సం సృష్టించిన వర్షాలు.. ఏపీని వదలడం లేదు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతుంది. దీంతో ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
(1 / 5)
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతుంది. దీంతో ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
మంగళ, బుధ, గురు వారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది.
(2 / 5)
మంగళ, బుధ, గురు వారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది.(@APSDMA)
ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని స్పష్టం చేశారు.
(3 / 5)
ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని స్పష్టం చేశారు.(@APSDMA)
అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. 
(4 / 5)
అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. (@APSDMA)
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద.. కృష్ణమ్మ శాంతించింది. అయితే.. తెలంగాణకు మళ్లీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. ఎగువన వర్షాలు కురిసి.. వరద ఉదృతి ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద H బ్లాక్‌ ఆపరేషన్ చేపట్టారు. రెండు భారీ పడవలను ఇనుప గడ్డర్లతో అనుసంధానించి బోట్లను తీయాలని నిర్ణయించారు. ఏడు రోజులుగా బోట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
(5 / 5)
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద.. కృష్ణమ్మ శాంతించింది. అయితే.. తెలంగాణకు మళ్లీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. ఎగువన వర్షాలు కురిసి.. వరద ఉదృతి ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద H బ్లాక్‌ ఆపరేషన్ చేపట్టారు. రెండు భారీ పడవలను ఇనుప గడ్డర్లతో అనుసంధానించి బోట్లను తీయాలని నిర్ణయించారు. ఏడు రోజులుగా బోట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.(@APSDMA)

    ఆర్టికల్ షేర్ చేయండి