తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Collectors Meet: తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలులో కలెక్టర్లే కీలకమన్న సిఎం రేవంత్ రెడ్డి

TG Collectors Meet: తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలులో కలెక్టర్లే కీలకమన్న సిఎం రేవంత్ రెడ్డి

16 July 2024, 12:22 IST

TG Collectors Meet: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సిఎం రేవంత్ రెడ్డి అకాంక్ష వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు ఏసి గదులకు పరిమితం కాకుండా ప్రజల్లో పర్యటించాలని, ప్రజల నాడి తెలుసుకోవడం ద్వారా వారికి చేరువ కావాలని సూచించారు. 

  • TG Collectors Meet: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సిఎం రేవంత్ రెడ్డి అకాంక్ష వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లు ఏసి గదులకు పరిమితం కాకుండా ప్రజల్లో పర్యటించాలని, ప్రజల నాడి తెలుసుకోవడం ద్వారా వారికి చేరువ కావాలని సూచించారు. 
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సగటున ఒక్కొ విద్యార్ధికి రూ.82వేల రుపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆ డబ్బును సద్వినియోగం చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుందని  చెప్పారు. 
(1 / 4)

సెక్రటేరియట్‌ 7వ అంతస్తులోకలెక్టర్ల సదస్సును ముఖ్యమంత్రి నిర్వహించారు.  కలెక్టర్లకు కొన్ని సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు చెవులుగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
(2 / 4)

ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఐఏఎస్‌లు శంకరన్, శ్రీధరన్‌లను ఆదర్శంగా తీసుకుని కలెక్టర్లు పనిచేయాలని రేవంత్ అభిప్రాయపడ్డారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజల నాడి తెలుసుకుని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కలెక్టర్ల బాధ్యత కీలకంగా ఉంటుందని చెప్పారు. 
(3 / 4)

ఆరుగ్యారెంటీలను సమర్దవంతంగా అమలు చేయాలని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. తెలంగాణ కలెక్టర్ల సదస్సు ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. 
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి