తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cm Chandrababu : బాత్ రూమ్ టబ్ రూ.26 లక్షలు, కమోడ్ రూ.12 లక్షలు- రుషికొండ ప్యాలెస్ ను చూసి సీఎం చంద్రబాబు ఆశ్చర్యం

CM Chandrababu : బాత్ రూమ్ టబ్ రూ.26 లక్షలు, కమోడ్ రూ.12 లక్షలు- రుషికొండ ప్యాలెస్ ను చూసి సీఎం చంద్రబాబు ఆశ్చర్యం

02 November 2024, 18:59 IST

CM Chandrababu At Rushikonda : విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వైఎస్ జగన్ రెడ్డి తానే శాశ్వతంగా సీఎంగా ఉండిపోతా అనే భ్రమతో, రూ.500 కోట్లతో కట్టిన రుషికొండ ప్యాలెస్ కట్టించారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. శనివారం సాయంత్రం రుషికొండ ప్యాలెస్ భవనాలను మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించారు.  
(1 / 6)

వైఎస్ జగన్ రెడ్డి తానే శాశ్వతంగా సీఎంగా ఉండిపోతా అనే భ్రమతో, రూ.500 కోట్లతో కట్టిన రుషికొండ ప్యాలెస్ కట్టించారని టీడీపీ ఆరోపించింది. లంకంత బెడ్ రూమ్, ఇంపోర్టెడ్ ఫర్నిచర్ తో చేసిన బెడ్, కుర్చీలు ఉన్నాయని పేర్కొంది.   
(2 / 6)

ఒక సీఎం తన విలాసాల కోసం, పర్యావరణాన్ని విధ్వంసం చేసి మరీ, ప్యాలెస్ కట్టుకోవటం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ప్రజాధనంతో ఇలా విచ్చలవిడితనం చేసే ధైర్యం చేశారంటే, ఏమనాలన్నారు.  విచ్చలవిడితనం ఎక్కువై, ప్రజా ధనంతో కట్టిన విలాసవంతమైన రుషికొండ ప్యాలెస్‌లో రూ.26 లక్షల బాత్ టబ్ ఏర్పాటుచేశారన్నారు.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాత్ టబ్ ఇదేనేమో అన్నారు.  
(3 / 6)

తన విలాసాల కోసం, తానే ఇక శాశ్వత సీఎం అనే భ్రమతో, జగన్ కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ లో రూ.3 లక్షల వరకు ఖరీదు చేసే ఫ్యాన్సీ ఫ్యాన్లు  పెట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి వస్తారా? అని ప్రజలు ఆలోచించాలన్నారు.
(4 / 6)

జగన్ పేదలు vs పెత్తందార్లు అంటారని, పేదల సొమ్ముతో ఇలాంటి విలాసవంతమైన భవనాలు కట్టుకున్న వ్యక్తిని ఏమనాలని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి మనస్తత్వం ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. విలాసవంతమైన ప్యాలెస్ లో, బాత్ రూమ్ లో టబ్ లో పడుకోవటానికి రూ.26 లక్షలు ఖర్చు పెట్టారని, కమోడ్ మీద కూర్చోవటానికి రూ.12 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. 
(5 / 6)

ఒక వ్యక్తి తన విలాసాల కోసం కట్టుకున్న ఈ రుషికొండ ప్యాలెస్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం వేస్తుంది, తరువాత కోపం వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కలిపి రూ.500 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ, తన విలాసాల కోసం కట్టిన ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి