తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chocolate Day 2024: చాక్లెట్... ఇది దేవతలకు ఇష్టమైన ఆహారం, మొదటిగా చాక్లెట్ ఎక్కడ తయారైందంటే…

Chocolate Day 2024: చాక్లెట్... ఇది దేవతలకు ఇష్టమైన ఆహారం, మొదటిగా చాక్లెట్ ఎక్కడ తయారైందంటే…

08 February 2024, 11:57 IST

ఫిబ్రవరి 9న చాక్లెట్ డే. చాక్లెట్ అంటే ఎంతో మందికి ఇష్టం. చిన్న వేడుకైనా కూడా ఇంట్లో చాక్లెట్లు ఉండాల్సిందే. ముఖ్యంగా వాలెంటైన్స్ డే కు చాక్లెట్లు విపరీతంగా అమ్ముడవుతాయి.

  • ఫిబ్రవరి 9న చాక్లెట్ డే. చాక్లెట్ అంటే ఎంతో మందికి ఇష్టం. చిన్న వేడుకైనా కూడా ఇంట్లో చాక్లెట్లు ఉండాల్సిందే. ముఖ్యంగా వాలెంటైన్స్ డే కు చాక్లెట్లు విపరీతంగా అమ్ముడవుతాయి.
వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు  చాక్లెట్ డేను నిర్వహించుకుంటారు. ప్రేమించిన వారికి చాక్లెట్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమైనా, స్నేహమైనా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం సహజం. అందరూ తమ ప్రియమైన వారికి చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. చాక్లెట్‌కు ఎంతో చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలోని మయన్లు, అజ్టెక్ తెగల కాలంలో చాక్లెట్లు ఉండేవని చెబుతారు. 
(1 / 8)
వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు  చాక్లెట్ డేను నిర్వహించుకుంటారు. ప్రేమించిన వారికి చాక్లెట్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమైనా, స్నేహమైనా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం సహజం. అందరూ తమ ప్రియమైన వారికి చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. చాక్లెట్‌కు ఎంతో చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలోని మయన్లు, అజ్టెక్ తెగల కాలంలో చాక్లెట్లు ఉండేవని చెబుతారు. (Unsplash)
చాక్లెట్ తొలిసారిగా దక్షిణ అమెరికాలో తయారైందని చరిత్రకారులు చెబుతున్నారు.  ఇక్కడ కోకో చెట్లు అధికంగా పెరిగేవి. మయన్లు,  అజ్టెక్‌ తెగల వారు  కోకో గింజలను చాలా విలువైనవిగా భావించారు. అప్పట్లో వీటితో ఒక పానీయాన్ని తయారుచేసేవారు. 
(2 / 8)
చాక్లెట్ తొలిసారిగా దక్షిణ అమెరికాలో తయారైందని చరిత్రకారులు చెబుతున్నారు.  ఇక్కడ కోకో చెట్లు అధికంగా పెరిగేవి. మయన్లు,  అజ్టెక్‌ తెగల వారు  కోకో గింజలను చాలా విలువైనవిగా భావించారు. అప్పట్లో వీటితో ఒక పానీయాన్ని తయారుచేసేవారు. (Unsplash)
స్పానిష్ అన్వేషకులు 16వ శతాబ్దంలో కోకో పొడిని రుచి చూశారు. వారు తమతో కోకో గింజలను యూరోప్ కు తీసుకెళ్లారు.  అక్కడ వీటిని అధికంగా పండించారు. 
(3 / 8)
స్పానిష్ అన్వేషకులు 16వ శతాబ్దంలో కోకో పొడిని రుచి చూశారు. వారు తమతో కోకో గింజలను యూరోప్ కు తీసుకెళ్లారు.  అక్కడ వీటిని అధికంగా పండించారు. (Unsplash)
కోకో చెట్టును శాస్త్రీయంగా థియోబ్రోమా కాకో అంటారు.  గ్రీకులో దీని అర్థం  "దేవతల ఆహారం". ఈ పేరు పురాతన నాగరికతతో చాక్లెట్ పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.
(4 / 8)
కోకో చెట్టును శాస్త్రీయంగా థియోబ్రోమా కాకో అంటారు.  గ్రీకులో దీని అర్థం  "దేవతల ఆహారం". ఈ పేరు పురాతన నాగరికతతో చాక్లెట్ పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.(Unsplash)
చాక్లెట్‌లో వాడే  కోకో పొడి శాతం దాని రుచిని నిర్ణయిస్తుంది. అధిక కోకో పొడితో కూడిన డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
(5 / 8)
చాక్లెట్‌లో వాడే  కోకో పొడి శాతం దాని రుచిని నిర్ణయిస్తుంది. అధిక కోకో పొడితో కూడిన డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.(Unsplash)
చాక్లెట్ తయారీలో కోకో గింజలను పులియబెట్టడం, వేయించడం, వాటిని పేస్ట్‌గా రుబ్బడం, ఆపై చక్కెర,  ఇతర పదార్థాలను జోడించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ చాక్లెట్‌కు  ప్రత్యేక రుచిని, రంగును అందిస్తుంది.
(6 / 8)
చాక్లెట్ తయారీలో కోకో గింజలను పులియబెట్టడం, వేయించడం, వాటిని పేస్ట్‌గా రుబ్బడం, ఆపై చక్కెర,  ఇతర పదార్థాలను జోడించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ చాక్లెట్‌కు  ప్రత్యేక రుచిని, రంగును అందిస్తుంది.(Unsplash)
చాక్లెట్ ఆనందానికి,  వేడుకలకు చిహ్నంగా మారింది. వాలెంటైన్స్ డేకు ప్రత్యేకం ఈ చాక్లెట్లు. 
(7 / 8)
చాక్లెట్ ఆనందానికి,  వేడుకలకు చిహ్నంగా మారింది. వాలెంటైన్స్ డేకు ప్రత్యేకం ఈ చాక్లెట్లు. (Unsplash)
చాక్లెట్లతో ఇప్పుడు రకరకాల శిల్పాలను తయారుచేస్తున్నారు చెఫ్‌లు. ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే ఆహారం చాక్లెట్లే. 
(8 / 8)
చాక్లెట్లతో ఇప్పుడు రకరకాల శిల్పాలను తయారుచేస్తున్నారు చెఫ్‌లు. ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే ఆహారం చాక్లెట్లే. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి