తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Waltair Veerayya Success Meet: గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లొచ్చాయి - చిరంజీవి

Waltair Veerayya Success Meet: గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లొచ్చాయి - చిరంజీవి

14 January 2023, 19:26 IST

Waltair Veerayya Success Meet: వాల్తేర్ వీర‌య్య విజ‌యం స‌మిష్టి కృషి వ‌ల్లే సాధ్య‌మైంద‌ని అన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య సినిమా శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ర‌వితేజ మ‌రో హీరోగా న‌టించిన ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో చిరంజీవి, ర‌వితేజ‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్న‌ది.

వాల్తేర్ వీర‌య్య సినిమాను ద‌ర్శ‌కుడు బాబీ అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని చిరంజీవి అన్నాడు. త‌న అనుభ‌వంతో ఇచ్చిన స‌ల‌హాల‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని క‌ష్ట‌ప‌డ్డాడ‌ని పేర్కొన్నాడు. 
(1 / 6)

ర‌వితేజ పాత్ర వ‌ల్లే వాల్తేర్ వీర‌య్య సెకండాఫ్‌కు అందం వ‌చ్చింద‌ని చిరంజీవి తెలిపాడు. ర‌వితేజ‌ను త‌న త‌మ్ముడిగానే భావిస్తాన‌ని, అందువ‌ల్లే అత‌డితో న‌టిస్తున్న‌ప్పుడు గ్లిజ‌రిన్ లేకుండానే క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని చిరంజీవి తెలిపాడు.
(2 / 6)

మంచి కంటెంట్‌తో సినిమా చేస్తే ప్రేక్ష‌కులు ఆద‌రించి పెద్ద విజ‌యాన్ని అందిస్తార‌ని వాల్తేర్ వీర‌య్య మ‌రోసారి నిరూపించింద‌ని చిరంజీవి చెప్పాడు. 
(3 / 6)

చిరంజీవితో మ‌రో ఫుల్ లెంగ్త్ సినిమా చేయాల‌ని ఉంద‌ని ర‌వితేజ పేర్కొన్నాడు.
(4 / 6)

వాల్తేర్ వీర‌య్య‌లో చిరంజీవి, ర‌వితేజ మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నాయ‌ని డైరెక్ట‌ర్ బాబీ తెలిపాడు. 
(5 / 6)

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న గేయ‌ర‌చ‌యిత చంద్ర‌బోస్‌ను వాల్తేర్ వీర‌య్య టీమ్ స‌త్క‌రించింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి