తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ttd Brahmotsavalu 2024 : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు - చిన్న శేష వాహనంపై మలయప్పస్వామి, ఫొటోలు

TTD Brahmotsavalu 2024 : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు - చిన్న శేష వాహనంపై మలయప్పస్వామి, ఫొటోలు

05 October 2024, 11:30 IST

Tirumala Brahmotsavalu 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 2వ రోజైన శ‌నివారం ఉదయం చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప కటాక్షించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఫొటోలు చూడండి..

  • Tirumala Brahmotsavalu 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 2వ రోజైన శ‌నివారం ఉదయం చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప కటాక్షించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఫొటోలు చూడండి..
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శ‌నివారం ఉదయం చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప దర్శనమిచ్చారు.
(1 / 5)

మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 
(2 / 5)

ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది
(3 / 5)

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
(4 / 5)

శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.  ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. మరోవైపు టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి