తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cars Launch In November : నవంబర్​లో లాంచ్​కు సిద్ధమవుతున్న కార్లు ఇవే!

Cars launch in November : నవంబర్​లో లాంచ్​కు సిద్ధమవుతున్న కార్లు ఇవే!

31 October 2023, 7:20 IST

Cars launch in November : పండుగ సీజన్​లో క్రేజీ ఆఫర్స్​ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న పలు ఆటోమొబైల్​ సంస్థలు.. నవంబర్​లో కొత్త కొత్త వాహనాల లాంచ్​కు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వీటితో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్స్​ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..

  • Cars launch in November : పండుగ సీజన్​లో క్రేజీ ఆఫర్స్​ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న పలు ఆటోమొబైల్​ సంస్థలు.. నవంబర్​లో కొత్త కొత్త వాహనాల లాంచ్​కు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వీటితో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్స్​ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​ఈ.. ఇటీవలే అంతర్జాతీయంగా లాంచ్​ అయ్యింది. నవంబర్​ 2న ఈ మోడల్​ ఇండియాలోకి అడుగుపెట్టనుంది. ఇందులో 3.0 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. పెట్రోల్​ ఇంజిన్​ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్స్​షోరూం ధర రూ. 93లక్షలకు అటు, ఇటుగా ఉండొచ్చు.
(1 / 5)

మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​ఈతో పాటు సీ43 ఏఎంజీ కూడా ఇండియాలో లాంచ్​ అవ్వనుంది. లాంచ్​ డేట్​పై ఇంకా క్లారిటీ లేదు. కాగా.. బేస్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 1కోటిగా ఉండొచ్చు.
(2 / 5)

టాటా పంచ్​ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్​ నుంచి ఈ మోడల్​ లాంచ్​ కోసం నిరీక్షణలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు.. నవంబర్​లో ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని టాక్​ నడుస్తోంది.
(3 / 5)

స్కోడా సూపర్బ్​కు సంబంధించి పలు టీజర్స్​ని వదిలింది సంస్థ. ఈ మోడల్​ని అంతర్జాతీయంగా.. నవంబర్​ 2న ఆవిష్కరించనుంది. ఇండియాలో ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 40లక్షలుగా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఇది ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టొచ్చు.
(4 / 5)

రెనాల్ట్​ డస్టర్​ అనేది భారతీయులకు ఒక ఎమోషన్​. ఇండియాలో లాంచ్​ అయిన తొలి ఎస్​యూవీ ఇదే! కాగా పోటీ తట్టుకోలేక ఈ మోడల్​ వెనకపడింది. ఇక రెనాల్ట్​ డస్టర్​ థర్డ్​ జెనరేషన్​ వర్షెన్​ని నవంబర్​ 29 అంతర్జాతీయంగా ఆవిష్కరించనుంది సంస్థ. ఇండియాలో లాంచ్​కు కాస్త సమయం పట్టొచ్చు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి