తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Byd Seal Ev: భారత్ లో విలాసవంతమైన బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్

BYD Seal EV: భారత్ లో విలాసవంతమైన బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్

HT Telugu Desk HT Telugu

16 March 2024, 20:29 IST

google News
  • BYD Seal EV: విలాసవంతమైన ఎలక్ట్రిక్ కార్ మోడల్ బీవైడీ సీల్ ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రీమియం, లగ్జూరియస్ బీవైడీ సీల్ కారు భారత మార్కెట్లో మూడు వేరియంట్లలో లభిస్తుంది.

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్
బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్

బీవైడీ ఇండియా నెమ్మదిగా భారత మార్కెట్ కోసం తమ పోర్ట్ ఫోలియోను విస్తరిస్తోంది. ఈ6 ఎంపీవీతో ప్రారంభించి ఆ తర్వాత అటో 3ని లాంచ్ చేశారు. ఈ6 మోడల్ కమర్షియల్ స్పేస్ లో బాగా విజయవంతమైంది. అటో 3 కూడా ఇండియన్ మార్కెట్లో మంచి సేల్స్ సాధిస్తోంది. అటో 3 ఎలక్ట్రిక్ కార్ ఎస్ యూవీ కావడం వల్ల ఎక్కువ మంది భారతీయులను ఆకర్షిస్తుంది. భవిష్యత్తులో బీవైడీ మరింత సరసమైన మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, లేటెస్ట్ గా బీవైడీ నుంచి ఎలక్ట్రిక్ సెడాన్ ‘బీవైడీ సీల్’ (BYD Seal EV) భారతీయ మార్కెట్లో ప్రవేశించింది.

బీవైడీ సీల్ ఈవీ: వేరియంట్లు

బీవైడీ సీల్ ఈవీ (BYD Seal EV) మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్. డైనమిక్, ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ గా మాత్రమే లభిస్తాయి. పెర్ఫార్మెన్స్ ట్రిమ్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్ ట్రెయిన్ తో వస్తుంది.

బివైడి సీల్ ఈవీ: స్పెసిఫికేషన్స్

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ (BYD Seal EV) డైనమిక్ 201 బీహెచ్పీ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, అయితే ప్రీమియం 308 బీహెచ్ పీ పవర్ ను, 360 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ అయిన పెర్ఫార్మెన్స్ వేరియంట్ రెండు మోటార్ల నుండి 522 బిహెచ్పీ పవర్, 670 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

బీవైడీ సీల్ ఈవీ: కలర్ ఆప్షన్లు, ధర

బీవైడీ సీల్ ఈవీ (BYD Seal EV) ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే, బీవైడీ సీల్ డైనమిక్ వేరయంట్ అత్యంత సరసమైన వేరియంట్. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ .41 లక్షలు. అలాగే, ప్రీమియం వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ .45.55 లక్షలు. చివరగా, టాప్-ఎండ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ .53 లక్షలు.

ఆఫర్స్, డీల్స్

మార్చి 31, 2024 లోగా బీవైడీ సీల్ ను బుక్ చేసుకున్న వినియోగదారులకు బుకింగ్ పాలసీ ప్రకారం 7 కిలోవాట్ల హోమ్ ఛార్జర్, ఇన్ స్టలేషన్ సర్వీస్, 3 కిలోవాట్ల పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్, బీవైడీ సీల్ వీ టు ఎల్ (వెహికల్ టు లోడ్) మొబైల్ పవర్ సప్లై యూనిట్, 6 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఒక కాంప్లిమెంటరీ ఇన్స్పెక్షన్ సర్వీస్ లభిస్తాయి.

తదుపరి వ్యాసం