తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bird Flu: మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. జార్ఖండ్‌లో నిర్ధారణ

Bird flu: మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. జార్ఖండ్‌లో నిర్ధారణ

21 March 2023, 14:30 IST

Bird flu: జార్ఖండ్‌లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. గత కొద్దిరోజులుగా వందల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వ్యాధి సోకిన ఫారంలోని మిగిలిన కోళ్లను కూడా చంపేశారు. 

  • Bird flu: జార్ఖండ్‌లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. గత కొద్దిరోజులుగా వందల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వ్యాధి సోకిన ఫారంలోని మిగిలిన కోళ్లను కూడా చంపేశారు. 
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలోి ఓ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్‌ఫ్లూ సోకినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేయడంతోపాటు అన్ని జిల్లాల పాలనాధికారులను అప్రమత్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు బుధవారం విలేకరులతో మాట్లాడారు.
(1 / 5)

భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏఎన్)కు పంపిన శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ అని కూడా పిలుచుకునే ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (హెచ్5ఎన్1) నిర్ధారణ అయినట్టు జార్ఖండ్ పశుసంవర్ధక డైరెక్టర్ చందన్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చారు.
(2 / 5)

చందన్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, 'ఆ పౌల్ట్రీలోని సుమారు 1,000 కోళ్లలో 70 నుండి 80 శాతం గత వారంలో చనిపోయాయి, ఇది బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయ్యాక పౌల్ట్రీలోని మిగిలిన కోళ్లను చంపాలని నిన్న ఆదేశాలు జారీచేశాం..’ అని వివరించారు.
(3 / 5)

పౌల్ట్రీ ఫారంలో 1 కి.మీ వరకు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించామని, 10 కి.మీ ప్రాంతాన్ని నిఘా జోన్‌గా ప్రకటించామని చందన్ కుమార్ తెలిపారు. ఆ ప్రాంతంలో బాతులు, కోళ్ల విక్రయాలను నిలిపివేశారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ హెచ్చరికలు జారీ చేశారు. కోళ్ల ఫారాలపై నిఘా పెంచారు.
(4 / 5)

మరోవైపు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఆసుపత్రిని అప్రమత్తం చేశారు. ఆ ప్రాంత ప్రజలు ప్రస్తుతం బాతు, కోడి మాంసం తినకుండా నిషేధం విధించారు. అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని జార్ఖండ్‌లోని పశుసంవర్ధక డైరెక్టర్ పేర్కొన్నారు. ఎలాంటి భయాందోళనలకు కారణం లేదని ఆయన అన్నారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి