తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bigg Boss 15 | బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌గా బుల్లితెర నటి.. ప్రైజ్‌ మనీ ఎంతంటే?

Bigg Boss 15 | బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌గా బుల్లితెర నటి.. ప్రైజ్‌ మనీ ఎంతంటే?

31 January 2022, 11:24 IST

హిందీ బిగ్‏బాస్ (Bigg Boss) సీజన్ 15 విజేతగా బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్ నిలిచింది. ఉత్కంఠగా సాగిన పోరులో తేజస్వి ప్రకాష్‌ను టైటిల్ విన్నర్‌గా ప్రకటించగా, నటుడు ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  • హిందీ బిగ్‏బాస్ (Bigg Boss) సీజన్ 15 విజేతగా బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్ నిలిచింది. ఉత్కంఠగా సాగిన పోరులో తేజస్వి ప్రకాష్‌ను టైటిల్ విన్నర్‌గా ప్రకటించగా, నటుడు ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
టీవీ ప్రేక్షకులను 'బిగ్ బాస్' విశేషంగా ఉంటుంది. ఇది ప్రసారమవుతున్న సమయంలో జనాలు పనులు మానేసి మరి టీవీలకే అతుక్కుపోతున్నారు. ఈ రియాలిటీ షోకి ఇంతటి క్రేజ్ ఉండబట్టే.. తొలుత హిందీలో మెుదలై, అనేక ప్రాంతీయ భాషకు విస్తరించి ఎన్నో సీజన్లను పూర్తి చేస్తుకుంది.
(1 / 5)

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా హిందీలో ఏళ్ల తరబడి సాగుతున్న బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో ఈ షో ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకుంది. సీజన్ 15 ఫినాలే ఆదివారం రోజున ఎంతో ఉత్కంఠగా, వినోదభరితంగా సాగింది.
(2 / 5)

బిగ్ బాస్ హిందీ, సీజన్ 15 విజేతగా బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్ నిలిచింది. ఆమె ముక్కుసూటి తనం, నిక్కచ్చిగా మాట్లాడే తత్వం అభిమానులను ఎంతో ఆకట్టుకోవడంతో అత్యధిక ఓట్లు వేసి ఆమెను గెలిపించారు.
(3 / 5)

టైటిల్ విన్నర్‌గా నిలిచినందుకు తేజస్వి ఉబ్బితబ్బిబయిపోయారు. "హౌస్‌లో మెుదటిసారి అడుగు పెట్టినప్పుడు కాస్త కొత్తగా అనిపించినా.. మెల్లిమెల్లిగా అలవాటు పడ్డాను. తక్కు వ సమయంలోనే గేమ్‌ను అర్థం చేసుకున్నాను. ప్రైజ్ మనీకి మించిన విలువైన జ్ఞాపకాలు, అనుభవాలు సొంతం చేసుకున్నాను. సల్మాన్ సర్ ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులు ఓట్లు వేసి గెలిపించినందుకు వారికెంతో కృతజ్ఞతలు" అంటూ భావోద్వేగపూరితంగా చెప్పారు తేజస్వి.
(4 / 5)

ఇక టైటిల్ గెలిచిన తేజస్వికి బిగ్ బాస్ సీజన్15 ట్రోఫీతో పాటు రూ. 40 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకుంది. దీనితో పాటు సీజన్ మొత్తం హౌజ్‌లో గడిపినందుకు గానూ వచ్చే రెమ్యునరేషన్ అదనం.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి