తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme Updates : ప్రతి మండలంలో 'ఇందిరమ్మ మోడల్ హౌజ్' నిర్మాణం..! అర్హుల జాబితా ఎప్పుడంటే..?

TG Indiramma Housing Scheme Updates : ప్రతి మండలంలో 'ఇందిరమ్మ మోడల్ హౌజ్' నిర్మాణం..! అర్హుల జాబితా ఎప్పుడంటే..?

22 December 2024, 8:27 IST

TG Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సర్వే కొనసాగుతోంది. ఈనెల 30వ తేదీలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే లబ్ధిదారులను గురిస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రతి మండలంలో మోడల్ హౌజ్ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించారు. 

  • TG Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సర్వే కొనసాగుతోంది. ఈనెల 30వ తేదీలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే లబ్ధిదారులను గురిస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రతి మండలంలో మోడల్ హౌజ్ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించారు. 
ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం యాప్ సర్వే చేస్తోంది. ఈనెలాఖారు నాటికి సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇందుకు డెడ్ లైన్ కూడా విధించింది.
(1 / 7)

యాప్ సర్వే పూర్తి అయిన వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల మోడల్ ను ప్రతి మండలంలో కడుతున్నట్లు ప్రకటించారు.  
(2 / 7)

శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి… కల్లూరు మండలంలో ఇందిరమ్మ మోడల్ ఇండ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాబోయే నాలుగు ఏళ్లలో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా కట్టాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
(3 / 7)

ప్రజాపాలనలో 1 కోటి ఐదు లక్షల అప్లికేషన్ వస్తే ఇళ్ల కోసంమే ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని పొంగులేటి పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తుదాడి ఇంటికి వెళ్లి అధికారులు సర్వే చేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కండిషన్లు ఏమీ లేవని… పేదవాడై అర్హత ఉంటే ఇస్తామన్నారు. నాలుగు విడతల్లో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు.
(4 / 7)

 ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి… వారి ఇంటి వద్దకు వెళ్తున్నారు. సర్వేకు ఒక రోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి… వివరాలను సేకరిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమిస్తూ అధికారులు సర్వే చేస్తున్నారు. 
(5 / 7)

రాష్ట్రవ్యాప్తంగా 80,54,554 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో  వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్‌గా పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా… అధికారులు పని చేస్తున్నారు. 
(6 / 7)

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. అయితే ఈనెలాఖారులోపు సర్వే పూర్తి కాకపోతే… జనవరి మొదటి వారంలోపైనా పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సర్వేలో భాగంగా… దరఖాస్తుదాడి ఫొటోతో పాటు ఖాళీ స్థలం, ప్రస్తుతం ఉంటున్న ఇంటి చిత్రాలను కూడా యాప్లో అప్ లోడ్ చేస్తున్నారు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి