తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Elections Counting 2023 : పక్కా ఏర్పాట్లతో ‘కౌంటింగ్‌’... రేపు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం

Telangana Elections Counting 2023 : పక్కా ఏర్పాట్లతో ‘కౌంటింగ్‌’... రేపు ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం

02 December 2023, 10:21 IST

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఆదివారం (డిసెంబరు 3)  వెల్లడించే ఫలితాల కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాజ్‌రాజ్‌ వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది.

  • Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఆదివారం (డిసెంబరు 3)  వెల్లడించే ఫలితాల కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాజ్‌రాజ్‌ వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది.
మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో ఉన్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం డిసెంబర్ 3వ తేదీన తేలనుంది. అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. 
(1 / 5)
మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో ఉన్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం డిసెంబర్ 3వ తేదీన తేలనుంది. అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. (CEO Telangana Twitter)
స్ట్రాంగ్‌రూంల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం  49 ప్రాంతాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం 1,766 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే 14 టేబుల్స్ ఉన్నాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంది.
(2 / 5)
స్ట్రాంగ్‌రూంల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం  49 ప్రాంతాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం 1,766 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే 14 టేబుల్స్ ఉన్నాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంది.(CEO Telangana Twitter)
ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుల్ ఉన్నాయి. 
(3 / 5)
ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుల్ ఉన్నాయి. (CEO Telangana Twitter)
పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
(4 / 5)
పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.(CEO Telangana Twitter)
డిసెంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అరగంట తర్వాత.. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుందని ఈసీ వర్గాలు తెలిపాయి. 
(5 / 5)
డిసెంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అరగంట తర్వాత.. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుందని ఈసీ వర్గాలు తెలిపాయి. (CEO Telangana Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి