తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather News : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ - ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు!

AP TG Weather News : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ - ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు!

28 September 2024, 16:48 IST

AP Telangana Weather News: ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

  • AP Telangana Weather News: ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉపరితల ద్రోణ కర్ణాటక నుంచి మన్నార్ వరకు తమిళనాడు అంతర్భాగంగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
(1 / 7)

ద్రోణి ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.  
(2 / 7)

ఇవాళ, రేపు, ఎల్లుండి.. ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు గంటకు 30- 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. సీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. 
(3 / 7)

ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం పేర్కొంది.  
(4 / 7)

ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.రేపు(సెప్టెంబర్ 29) నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడుతాయని హైదారాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది. 
(5 / 7)

సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.
(6 / 7)

ఇక హైదరాబాద్ లో చూస్తే... ఇవాళ తేలికపాటి వర్షం లేదా ఉరుమలు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నైరుతి,పశ్చిమ దిశలో ఉపరితల గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి