తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణలో వర్షాలు, ఈ జిల్లాలకు Imd హెచ్చరికలు

AP TG Weather Updates : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్..! ఏపీ, తెలంగాణలో వర్షాలు, ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు

09 October 2024, 14:54 IST

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 
ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి లక్షద్వీప్ తో పాటు పక్కనే ఉన్న ఆరేబియా సముద్రం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. దీనితోడుగా ఉపరితల ద్రోణి కూడా ఉందని... ఇది కేరళ మీదుగా సగటు సముద్రమట్టానికి 1 .5 కి.మీ ఎత్తులో విస్తరించి బుధవారం బలహీనపడిందని పేర్కొంది.  
(1 / 6)

ఈ ప్రభావంతో ఏపీలో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఉత్తర కోస్తా,దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడుతాయని తెలిపింది.  
(2 / 6)

ఇక రాయలసీమ జిల్లాల్లో ఇవాళ, రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడుతాయని వివరించింది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయని ప్రకటించింది.  
(3 / 6)

తెలంగాణలో చూస్తే ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(4 / 6)

రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట,గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(5 / 6)

అక్టోబర్ 11వ తేదీన కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక  అక్టోబర్ 12 నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి