తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Liquor Sales : మందుబాబులకు దీపావళి కానుక, నెలాఖరుకు రూ.99 మద్యం ఫుల్ స్టాక్

AP Liquor Sales : మందుబాబులకు దీపావళి కానుక, నెలాఖరుకు రూ.99 మద్యం ఫుల్ స్టాక్

22 October 2024, 17:04 IST

AP Liquor Sales : ఏపీలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రూ.99కే క్వార్టర్ మద్యం బాటిళ్ల ఉత్పత్తి పెంచినట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల మద్యం కేసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొత్త మద్యం పాలసీలో రూ.99 మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రూ.99కే క్వార్టర్ మద్యం బాటిళ్ల ఉత్పత్తి పెంచినట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల మద్యం కేసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొత్త మద్యం పాలసీలో రూ.99 మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 
(1 / 6)

రూ.99లకే క్వార్టర్ బాటిల్ మద్యం అందించేందుకు 4 కంపెనీలు సిద్ధమయ్యాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నెలాఖరుకల్లా రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. కొత్త మద్యం పాలసీలో ధరలు తగ్గుతాయని భావించిన మందబాబులకు చేదు అనుభవం ఎదురైంది. ధరలు తగ్గకపోవడం, రూ.99 మద్యం అన్ని చోట్ల లభ్యం కాకపోవడంతో మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  
(2 / 6)

బ్రాండెడ్ మద్యం దొరుకుతున్నా... ధరలు తగ్గలేదని, గత ప్రభుత్వంలో మాదిరిగానే ధరలు అధికంగా ఉన్నాయని మందుబాబులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ రూ.99 మద్యం ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ఆదేశించింది. దీంతో నాలుగు కంపెనీలు తమ 7 రకాల బ్రాండ్లను రూ.99 ఎమ్మార్పీకే విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి పొందాయి. 
(3 / 6)

వీలైనంత త్వరగా రూ.99కే మద్యం అధిక మొత్తంలో అందుబాటులోకి తెచ్చేలా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రోజుకు పదివేల కేసులు మాత్రమే వస్తున్నాయని, అవి వెంటనే అమ్ముడుపోతున్నాయని వైన్ షాపుల నిర్వాహుకులు అంటున్నారు. ముందుగా వచ్చిన వారికి మాత్రమే రూ. 99 మద్యం దొరుకుతుందని, వెనుక వచ్చిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారంటున్నారు. 
(4 / 6)

ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు కాసుల వర్షం కురుస్తుంది. గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అంతగా నచ్చక తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు బోర్డర్ దాటి నాణ్యమైన మద్యం సేవించేవారు. ఇప్పుడు ఏపీలోనే నచ్చిన బ్రాండ్ల దొరుకుతుండడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందంటున్నారు మందుబాబులు. దీపావళి నాటికి రూ.99కే మద్యం అందుబాటులోకి వస్తే ఇక ఫుల్ ఖుషీ అంటున్నారు. అక్టోబర్ 26 నుంచి మద్యం ధరల్లో మార్పులు వస్తాయని వైన్ షాపు యజమానులు అంటున్నారు.  
(5 / 6)

ఏపీలోని పలు జిల్లాల మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తిరుపతి, అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం, ఎన్టీఆర్, కడప జిల్లాల్లోని డిస్టిలరీస్‌పై దాడులు నిర్వహించారు. ఏడాది నుంచి ఎంత మొత్తంలో మద్యం తయారు చేశారనే దానిపై రికార్డులు తనిఖీ చేస్తున్నారు.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి