తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cm Jagan At Indrakeeladri : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

CM Jagan at Indrakeeladri : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

20 October 2023, 22:01 IST

AP CM Y S Jagan prays at Indrakeeladri: దసరా శరన్నవరాత్రుల్లో విశేష పుణ్యదినమైన మూలా నక్షత్రం రోజైన శుక్రవారం సీఎం జగన్… కనకదుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

  • AP CM Y S Jagan prays at Indrakeeladri: దసరా శరన్నవరాత్రుల్లో విశేష పుణ్యదినమైన మూలా నక్షత్రం రోజైన శుక్రవారం సీఎం జగన్… కనకదుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసం నుండి మధ్యాహ్నం 3.40 గంటలకి ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం చిన రాజగోపురం వద్ద స్థానాచార్యులు  విష్ణు బట్ల శివప్రసాద్ శర్మ పరివేష్ఠం చేశారు.                                                                   
(1 / 4)

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయ వస్త్రధారణతో పట్టు వస్త్రాలను, పసుపు కుంకుమలను తలపై పెట్టుకుని అంతరాలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు. 
(2 / 4)

ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు.
(3 / 4)

అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించే ఈ శుభ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి