తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather News : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..! ఈ జిల్లాలకు Imd హెచ్చరికలు

AP TG Weather News : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..! ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు

20 September 2024, 15:03 IST

 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

  •  బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
సముద్రమట్టానికి 3.1  మరియు 5.8 కి.మీల మధ్య పశ్చిమ మధ్య అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదు తుఫాన్ సర్కులేషన్ ఉందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 21 నాటికి ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఎగువ వాయు తుపాన్ సర్కులేషన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 23 సెప్టెంబర్ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది.  
(1 / 6)
సముద్రమట్టానికి 3.1  మరియు 5.8 కి.మీల మధ్య పశ్చిమ మధ్య అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదు తుఫాన్ సర్కులేషన్ ఉందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 21 నాటికి ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఎగువ వాయు తుపాన్ సర్కులేషన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 23 సెప్టెంబర్ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది.  (image source unsplash )
ఏపీలో ఇవాళ , రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్నిచోట్ల బలమైన ఉపరిత గాలలు వీస్తాయని అంచనా వేసింది. 
(2 / 6)
ఏపీలో ఇవాళ , రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్నిచోట్ల బలమైన ఉపరిత గాలలు వీస్తాయని అంచనా వేసింది. (image source unsplash )
ఇక దక్షిణ కోస్తాలో ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది. బలమైన ఉపరితల గాలుల వీస్తాయని తాజా బులెటిన్ లో పేర్కొంది. 
(3 / 6)
ఇక దక్షిణ కోస్తాలో ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని పేర్కొంది. బలమైన ఉపరితల గాలుల వీస్తాయని తాజా బులెటిన్ లో పేర్కొంది. (image source unsplash )
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 
(4 / 6)
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. (image source unsplash )
సెప్టెంబర్ 22వ తేదీన ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 
(5 / 6)
సెప్టెంబర్ 22వ తేదీన ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. (image source unsplash )
సెప్టెంబర్ 23వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(6 / 6)
సెప్టెంబర్ 23వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    ఆర్టికల్ షేర్ చేయండి