తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : బంగాళాఖాతంలో ఆవర్తనం - ఈ 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఆవర్తనం - ఈ 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు

14 July 2024, 6:04 IST

AP Telangana Weather Updates : ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజులు వానలు పడనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

  • AP Telangana Weather Updates : ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజులు వానలు పడనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దక్షిణ ఏపీ తీరంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి బలహీనపడినట్లు పేర్కొంది.
(1 / 6)
పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దక్షిణ ఏపీ తీరంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి బలహీనపడినట్లు పేర్కొంది.(Image Source @APSDMA Twitter)
ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళ,బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు.
(2 / 6)
ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మంగళ,బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.భారీ వర్షాల నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు.(Image Source @APSDMA Twitter)
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు
(3 / 6)
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు(Image Source @APSDMA Twitter)
ఇవాళ(జులై 14) మన్యం,అల్లూరి,అనకాపల్లి, ఏలూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,నంద్యాల,వైయస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 6)
ఇవాళ(జులై 14) మన్యం,అల్లూరి,అనకాపల్లి, ఏలూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,నంద్యాల,వైయస్ఆర్, అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.(Image Source @APSDMA Twitter)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(Image Source @APSDMA Twitter)
జులై 15 నుంచి 16వ తేదీ ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్ంగా సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 6)
జులై 15 నుంచి 16వ తేదీ ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్ంగా సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.(Image Source @APSDMA Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి