తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

21 December 2024, 16:13 IST

Ananya Nagalla: అచ్చ తెలుగు అందం అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్‌గా న‌టిస్తోన్న శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీ డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో వెన్నెల కిషోర్ హీరోగా న‌టించాడు.

శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీలో భ్రమరాంబ పాత్ర‌లో  అన‌న్య నాగ‌ళ్ల క‌నిపించ‌బోతున్న‌ది.  ఇప్పటివరకూ తెలుగులో చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ ఇద‌ని అన్న‌ది.  
(1 / 5)

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు.రాజీవ్ గాంధీ మ‌ర‌ణించిన రోజు జ‌రిగిన మ‌రో క్రైమ్ చుట్టూ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీ సాగుతుంద‌ని అన‌న్య నాగ‌ళ్ల అన్న‌ది. 
(2 / 5)

ఈ మూవీలో వెన్నెల‌కిషోర్ డిటెక్టివ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆ డిటెక్టివ్‌ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్ అని సినిమాకు డైరెక్ట‌ర్ టైటిల్ పెట్టాడ‌ని  అన‌న్య నాగ‌ళ్ల చెప్పింది. 
(3 / 5)

గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌లో ఓ కీల‌క పాత్ర చేశాను. ఆ సినిమా షూటింగ్‌లో కోర్టు సీన్ చేస్తున్నప్పుడు చాలా బాగా చేస్తున్నారు మీలో ఎమోషనల్ కోషేంట్ చాలా వుంది, రియల్ పెయిన్ కనిపిస్తుందని ప‌వ‌న్ మెచ్చుకున్నారు. ఆయ‌న ప్ర‌శంస‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. 
(4 / 5)

తెలుగు, హిందీ భాష‌ల్లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా  చేస్తున్నాన‌ని అన‌న్య నాగ‌ళ్ల చెప్పింది. . తెలుగులోనూ తాను హీరోయిన్‌గా న‌టించిన‌ కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు త్వ‌ర‌లో రిలీజ్ కానున్నాయ‌ని తెలిపింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి