తెలుగు న్యూస్  /  ఫోటో  /  Monsoon Enters Ap : ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో వర్షాలు

Monsoon Enters AP : ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో వర్షాలు

02 June 2024, 19:05 IST

Monsoon Enters AP : నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఏపీ అంతటా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

  • Monsoon Enters AP : నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఏపీ అంతటా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 
(1 / 6)
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. (Pexels)
ఏపీ అంతటా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 
(2 / 6)
ఏపీ అంతటా రుతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. (Pexels)
ఏపీలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 
(3 / 6)
ఏపీలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. (Pexels)
కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తన  ప్రభావంతో రాగల 3 రోజులు అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
(4 / 6)
కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తన  ప్రభావంతో రాగల 3 రోజులు అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (Pexels)
జూన్ ఏడో తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు నైరుతి పవనాల రాక కాస్త ఉపశమనం కలిగించింది. 
(5 / 6)
జూన్ ఏడో తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు నైరుతి పవనాల రాక కాస్త ఉపశమనం కలిగించింది. 
రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. 
(6 / 6)
రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి